బీజేపీ, టీడీపీలను ప్రజలు ఈసడించుకుంటున్నారు

ఢిల్లీ: ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజలంతా హోదాను రాష్ట్రానికి రాకుండా చేసిన చంద్రబాబును, బీజేపీని ఈసడించుకుంటున్నారని వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత ఎల్లసిరి గోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. అబద్ధాలు, నక్కజిత్తులతో నాలుగేళ్లుగా బీజేపీ, టీడీపీ కలిసి తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయకుండా కుట్రలు చేశారని మండిపడ్డారు. ఢిల్లీలో వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ దీక్షా ప్రాంగణం వద్ద గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. 13 రోజులుగా ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెడుతున్నా.. పార్లమెంట్‌లో బీజేపీ చర్చకు రానివ్వలేదంటే ఎంత కుట్ర జరుగుతుందో ప్రజలంతా గ్రహించాలన్నారు. హోదా ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష.. నా ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేస్తానని వైయస్‌ జగన్‌ చెప్పడం జరిగిందని, ఆ ప్రకారమే.. ఎంపీలతో రాజీనామాలు చేయించారన్నారు. వైయస్‌ఆర్‌ సీపీకి రాజీనామాలు చేయడం కొత్తేమీ కాదని, హోదా నినాదంతో ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామన్నారు. వైయస్‌ జగన్‌ వల్లే హోదా సాధ్యమని ప్రజలంతా భావిస్తున్నారన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top