నవరత్నాలు అన్నివర్గాలను ఆకట్టుకుంటున్నాయి
విజయవాడ: ల్యాండ్, సాండ్, మైన్, వైన్‌ మాఫియాలకు తెరతీసిన చంద్రబాబు పాలనను అంతమొందించేందుకు ప్రజలంతా కంకణం కట్టుకున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో పాల్గొన్న వెల్లంపల్లి, ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డిలు మాట్లాడుతూ.. ప్రజా సంకల్పయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. చంద్రబాబు అరాచకాలతో విసిగిపోయిన ప్రజలంతా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సంఘీభావ యాత్రకు సైతం విశేష స్పందన లభించిందని చెప్పారు. వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలు అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్నాయన్నారు. 600ల వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు ఒక్క హామీని కూడా పరిపూర్ణంగా అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో దోపిడీ మాఫియాలకు తెరతీసిన చంద్రబాబు పార్టీని సమాధి చేయాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. పుట్టబోయే బిడ్డపై కూడా రూ. 50 వేలు అప్పు వేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు. 
 
Back to Top