దుర్గగుడి వ్యవహారంలో కంటి తుడుపు చర్యలు

విజయవాడ: దుర్గగుడి వ్యవహారంలో కంటితుడుపుగా చర్యలు ఉన్నాయని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు.  అమ్మవారి గుడిలో దొంగతనం జరిగితే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సభ్యురాలిని సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకోవడంతో సరిపోదన్నారు. దుర్గగుడిలో జరిగిన క్షుద్రపూజలపై ఇంకా నివేదిక రాలేదన్నారు. ప్రభుత్వ తీరుపై భక్తులు ఆగ్రహంతో ఉన్నారని హెచ్చరించారు. 
Back to Top