దుర్గగుడి పవిత్రను దెబ్బతీస్తున్న పాలకమండలి

విజయవాడ: దుర్గగుడి పవిత్రతను దెబ్బ తీసేందుకు పాలక మండలి కంకణం కట్టుకుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాసులు ధ్వజమెత్తారు. అమ్మవారి చీర మాయమై 24 గంటలు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమన్నారు. ఆలయ ధర్మకర్తే తీశారని ఆధారాలున్నా అధికారులు వెనకేసుకు రావడం సిగ్గుచేటన్నారు. ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. గతంలో రూ. 50 లక్షల చీరల స్కాంలో ధర్మకర్త సూర్యలత పాత్ర ఉందని ఆరోపించారు. దుర్గగుడిలో క్షుద్రపూజలపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వం కూడా ఆలయ పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. వెంటనే పాలక మండలిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top