కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం వైయస్‌ఆర్‌సీపీ కృషి


విజయవాడ: కడపలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం వైయస్‌ఆర్‌సీపీ కృషి చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రయత్నాలను చంద్రబాబు అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. ఇప్పుడు బీజేపీ, టీడీపీ కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ దొంగదీక్ష చేస్తున్నారని, ప్రజలు టీడీపీని నమ్మడం లేదన్నారు. వైయస్‌ జగన్‌ వల్లే కడపలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. 
 
Back to Top