ఇంటికో ఉద్యోగం ఏదీ?

విజయవాడ: ఎన్నికలకు ముందు ఇస్తామన్న ఇంటికో ఉద్యోగం ఏమైందని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్‌ నిలదీశారు. 
ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఓట్లు వేయించుకొని ..అధికారంలోకి వచ్చాక మోసం చేశారని వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా నిరుద్యోగ భృతి ప్రకటించడం మోసపూరితమన్నారు. నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పి..ఇప్పుడు కేవలం 10 లక్షల మందికే వెయ్యి రూపాయల చొప్పున భృతి ఇస్తామని చెప్పడం దుర్మార్గమన్నారు. పచ్చ చొక్కాలు వేసుకున్న వారికే ఈ స్కీమ్‌ ఇస్తున్నారని విమర్శించారు. 
 
Back to Top