వైయస్‌ జగన్‌పై రైతులకు పూర్తి విశ్వాసం


పశ్చిమ గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మేలు చేస్తారని రైతులు విశ్వాసంతో ఉన్నారని వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వాసుబాబు అన్నారు. బుధవారం ఆయన మీడియాతోమాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌కు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఉంగటూరు నియోజకవర్గ సమన్వయకర్త వాసుబాబు అన్నారు. నియోజకవర్గంలో ఆక్వా రైతాంగం ఎక్కువగా ఉన్నారన్నారు. ఈ ప్రాంతాన్ని ఆక్వా జోన్‌గా ప్రకటించిందన్నారు. టీడీపీ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. వైయస్‌ఆర్‌ పాలనలో రైతులకు మేలు జరిగిందని, టీడీపీ ఆక్వా రైతులను పట్టించుకోవడం లేదన్నారు. ఆక్వా పరిశ్రమతో ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నా..రైతులకు ఎలాంటి సాయం చేయడం లేదన్నారు. రైతులంతా వైయస్‌ జగన్‌పై పూర్తి విశ్వాసంగా ఉన్నారని, ఎప్పుడు ముఖ్యమంత్రిని చేద్దామన్న ఆరాటంలో ఉన్నారని చెప్పారు. వైయస్‌ జగన్‌కు నియోజకవర్గంలో బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఇవాళ సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారని చెప్పారు. 

 
Back to Top