హైదరాబాద్: చంద్రబాబు ఆదేశాల మేరకే ఉత్తుత్తి ఐటీ దాడులు జరుగుతున్నాయని, ఏపీలో ఉన్న మంత్రులు, లోకేష్, చంద్రబాబు నివాసాలపై ఐటీ సోదాలు చేయాలని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండు చేశారు. సాధారణంగా జరుగుతున్న సోదాలను కూడా ఏపీపై దాడిగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఉదయం నుంచి ఏదో జరుగుతుందని ఎల్లో మీడియా ప్రచారం చేసిందన్నారు.