నాపై టీడీపీ కుట్ర చేస్తోంది

కావాలనే ఆరోపణలు చేస్తూ బురదజల్లే ప్రయత్నం
దేవినేని కుటుంబం వల్లే నందిగామలో ఫ్యాక్షన్‌
విశాఖపట్నం: టీడీపీ కావాలని తనపై బురదజల్లేందుకు ప్రయత్నం చేస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వసంత నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. తనపై కుట్ర జరుగుతోందన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1972 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ఏనాడూ అధికార దర్పాన్ని ప్రదర్శించలేదన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న కేఈ కృష్ణమూర్తి, కోడెల శివప్రసాద్, అయ్యన్నపాత్రుడు, గొల్లపల్లి సూర్యారావు, బుచ్చయ్యచౌదరి అందరితో కలిసి పనిచేశానని, వీరిలో ఎవరైనా నాగేశ్వరావు హింసాత్మక ఆలోచన, హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తారని చెప్పించగలరా అని ప్రశ్నించారు. తనపై బురదజల్లి పబ్బం గడుపుకునేందుకు టీడీపీ కుట్ర చేస్తుందన్నారు. నందిగామలో 1972లో ఎమ్మెల్యే అయినప్పుడు, 1981లో సమితి అధ్యక్షుడిగా, 1985లో ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల ఆదరాభిమానాలు చురగొన్నానన్నారు. తనకు ముక్కుపాటి వెంకటేశ్వరావుకు మధ్య వర్గ భేదాలు ఉన్నా.. కాంగ్రెస్‌కు తనకు విభేదం ఉన్నా చర్చలు జరిపి పరిష్కరించుకున్నాం కానీ అధికారంలో ఉందని ఏ రకమైన హింసకు పాల్పడలేదన్నారు. తన వర్గం తప్పు చేసినా క్షమించండి అని కోరేవాడినన్నారు. 

నందిగామ తాలూకాలో దేవినేని కుటుంబం రాజకీయాల్లో వచ్చాకే హత్యా రాజకీయాలు మొదలయ్యాయని నాగేశ్వరరావు అన్నారు. నందిగామ గాంధీ సెంటర్‌లో హత్యలు జరిగాయన్నారు. కృష్ణప్రసాద్‌ మైలవరం నియోజకవర్గం నుంచి పోటీకి ప్రయత్నం చేస్తే ప్రత్యర్థిగా ఉమామహేశ్వరావు ఉన్నారు. వైయస్‌ఆర్‌సీపీ జెండాలు పీకేస్తున్నాడు. దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నాడు అంటే కాలక్రమేనా జరగాల్సిందే జరుగుతుందని చెప్పాను కానీ ఏనాడూ  హింసలకు పాల్పడలేదన్నారు. 
 
Back to Top