బాబు పాలనలో రైతు కంట కన్నీరుఆరు జిల్లాల్లో కరువు విలయతాండవం
మహానేత వైయస్‌ఆర్‌ పాలనలో రైతు కళ్లలో సంతోషం
మళ్లీ ప్రజలంతా రాజన్న పాలన కోరుకుంటున్నారు
వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నాయకురాలు వరుడు కల్యాణి
విశాఖపట్నం: చంద్రబాబు పాలనలో రైతులు ఘోరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు వరుడు కల్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. 248వ రోజు ప్రజా సంకల్పయాత్రలో భాగంగా యలమంచిలి నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రజల ఆధరాభిమానాలతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర బ్రహ్మాండంగా కొనసాగుతుందన్నారు. ముఖ్యంగా రైతులు తమ కష్టాలు చెప్పుకుంటూ వైయస్‌ జగన్‌ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నారన్నారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ ప్రాంత రైతులు అంతా తీవ్రంగా నష్టపోయారన్నారు. రాష్ట్రం మొత్తం మీద రాయలసీమ నాలుగు జిల్లాలు, నెల్లూరు, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కరువుతో రైతులు కొట్టుమిట్టాడుతున్నారన్నారు. మిగిలిన జిల్లాలన్నీ అతివృష్టి, అనావృష్టితో అల్లాడుతున్నాయన్నారు. 

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో పాడిపంటలతో సంతోషంగా ఉన్న రైతులు చంద్రబాబు పాలనలో రైతు కళ్లలో కంటినీరు కనిపిస్తుందన్నారు. నాలుగున్నరేళ్లుగా ప్రజలు ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు. తొమ్మిది గంటల కరెంటు, రుణమాఫీ అని చెప్పి టీడీపీ సర్కార్‌ రైతులను మోసం చేసిందన్నారు. దీంతో అన్నదాతలు అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ దగ్గరకు వచ్చి మళ్లీ రాజన్న పాలన కావాలని కోరుకుంటున్నారన్నారు. చాలా మంది వలంటీర్‌గా వచ్చి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారన్నారు. వైయస్‌ జగన్‌ ప్రకటించిన హామీలు విని ఉత్తేజం పొంది వైయస్‌ జగన్‌ వెంట ఉంటాం. వైయస్‌ జగన్‌ వల్లే అభివృద్ధి సాధ్యమని, చంద్రబాబు అబద్ధపు ముఖ్యమంత్రి తప్ప అభివృద్ధి లేదని అందరూ తెలుసుకున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ సీఎం అవుతారని కల్యాణి ధీమా వ్యక్తం చేశారు. 
Back to Top