ఎన్నికల హామీల అమలు కోసం వరసాల ప్రసాద్ దీక్ష

రాజమండ్రి: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చాలంటూ వైఎస్ఆర్ సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి వరసాల ప్రసాద్ రిలేనిరాహార దీక్ష చేపట్టారు. హామీలతో పాటు అంగన్ వాడీ కార్యకర్తల జీతాలను వెంటనే చెల్లించాలంటూ తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఆయన మంగళవారం ఈ దీక్షను ప్రారంభించారు. వరసాల ప్రసాద్ చేపట్టిన రిలే నిరాహారదీక్షకు జిల్లాలోని వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మద్ధతు తెలిపాయి.
Back to Top