ఎన్నికలంటే వైయస్‌ జగన్‌కు భయం లేదు


న్యూఢిల్లీ: ఎన్నికలంటే వైయస్‌ జగన్‌ ఏ రోజు కూడా భయపడలేదని, ఆయన ధైర్యశాలీ అని రాజీనామా ఆమోదించుకున్న వరప్రసాద్‌ పేర్కొన్నారు. లోక్‌సభ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే చంద్రబాబుది అవినీతి పాలన అన్నారు. 29 సార్లు ఢిల్లీకి వచ్చిన కూడా చంద్రబాబు ఏమీ సాధించలేని అసమర్ధుడని విమర్శించారు. అబద్ధాలపై పునాదులు వేసుకొని అధికారంలో ఉన్నారన్నారు. అలాంటి వారికి సమాధానం చెప్పనక్కర్లేదన్నారు. లోక్‌సభ అయిపోయిన తరువాత, స్పీకర్‌ వెళ్లిన తరువాత టీడీపీ ఎంపీలు ఎలా ప్రవర్తించారో అందరూ చూశారన్నారు. మేం క్రమశిక్షణతో చిత్తశుద్ధితో స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామాలు చేశామన్నారు. పట్టుబట్టి మరీ మా రాజీనామాలు ఆమోధించుకున్నామన్నారు. ఆమరణ దీక్ష చేశామని గుర్తు చేశారు. ప్రజలు తీర్పు ఇస్తారన్నారు. చివరి వరకు పోరాటం చేస్తామని వరప్రసాద్‌ తెలిపారు.
 
Back to Top