వడ్డేపల్లి కుమారుడికి వైయస్‌ జగన్ పరామర్శ

హైదరాబాద్ :

అనారోగ్యంతో శుక్రవారం ఉదయం కన్నుమూసిన వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నాయకుడు వడ్డేపల్లి నర్సింగరావు కుటుంబాన్ని పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి పరామర్శించారు. వడ్డేపల్లి తనయుడు వడ్డేపల్లి రాజేశ్వర్‌రావుకు శ్రీ జగన్‌ స్వయంగా ఫోన్‌చేసి పరామర్శించారు. జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకొని నిలవాలని, అందుకు దేవుని ఆశీస్సులు కుటుంబానికి తప్పక ఉంటాయని అన్నారు. నర్సింగరావు కుటుంబానికి ధైర్యం చెప్పారు.

పార్టీ నాయకుడు వడ్డేపల్లి నర్సింగరావు శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కూకట్‌పల్లి రాజకీయాల్లో ప్రత్యేకతను సొంతం చేసుకున్న నర్సింగరావు.. మొదట బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డికి దగ్గరై ప్రధాన అనుచరుడిగా ఎదిగారు. మహానేత వైయస్ఆర్ మరణానంతరం 2012లో వై‌యస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గట్టు రామచంద్రరావు, పీఎన్వీ ప్రసాద్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పలువురు ప్రముఖులు వడ్డేపల్లి భౌతికకాయానికి నివాళులర్పించారు.

Back to Top