ప్రత్యేక హోదా..ప్రజల బలమైన ఆకాంక్ష


విశాఖ: ప్రత్యేక హోదా..ఏపీ ప్రజల బలమైన ఆకాంక్ష అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. చంద్రబాబుకు అధికారం, పదవులు ముఖ్యమని, ప్రజాశ్రేయస్సు పట్టడం లేదని మండిపడ్డారు. విశాఖలో నిర్వహిస్తున్న బంద్‌లో సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణతో కలిసి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లరని విమర్శించారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి కాపురం చేశారని, మరోపక్కా కాంగ్రెస్‌తో చెలిమి చేస్తున్నారని మండిపడ్డారు. రేపు ఎన్నికల్లో కూడా ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుంటారని పేర్కొన్నారు. రెండుసార్లు అసెంబ్లీలో ప్రత్యేక హోదా కోసం ఏకగ్రీవ తీర్మానం అంశాన్ని కేంద్రం ఇవ్వకుంటే..వారితో లాలూచీ పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నీ లాలూచీ వ్యవహారాన్ని ప్రధాని మోడీ పార్లమెంట్లో బయటపెట్టారన్నారు. ఎక్కడ వైయస్‌ఆర్‌సీపీ బలపడుతుందో అని భయంతో చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని భుజాన పెట్టుకున్నారన్నారు. చంద్రబాబుకు, బీజేపీకి ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
 
Back to Top