ఓటమి, విరామం ఎరుగని నాయకుడు వైయస్‌ఆర్‌

వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
గుంటూరు: ఓటమి, విరామం అనే పదాలు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి జీవితంలో లేవని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. గుంటూరు జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మహానేత 69వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌ విగ్రహానికి ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా, రావి వెంకటరమణలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశంలో ఏ నాయకుడు తీసుకురాని కొత్త సంస్కరణలు తీసుకొచ్చి పేదల గుండెల్లో వైయస్‌ఆర్‌ చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా ఓటమి అనేది లేకుండా రాజకీయ జీవితం గడిపారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఫీజురియంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి సాహసోపేత పథకాలను ప్రవేశపెట్టి నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహానుభావుడని కొనియాడారు. 
Back to Top