మోసానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబే

అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?

చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు మోసానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. నాలుగేళ్లుగా ప్రజలను వంచించినందుకా.. మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నావని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న వైయస్‌ఆర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ముగింపు కార్యక్రమానికి ఉమ్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్లు పాలనకాలంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేశారో దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి రాజకీయ సమాధి కట్టేందుకు ప్రజలంతా ఎదురుచూస్తున్నారన్నారు. దేశంలోనే అత్యంత సీనియర్‌ నాయకుడినని చెప్పుకునే చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 5 శాతం కూడా పూర్తి చేయలేదన్నారు. ఇటీవల 96 శాతం హామీలను పూర్తి చేశానని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. 
Back to Top