తొలి సంతకం ప్రాధాన్యత బాబు తగ్గించారు


హైదరాబాద్‌:  తొలి సంతకానికున్న ప్రాధాన్యతను చంద్రబాబు తగ్గించారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై వైయస్‌ఆర్‌సీపీ చార్జీషిట్‌ విడుదల చేసింది. వైయస్‌ఆర్‌సీపీ చార్జ్‌షిట్, టీడీపీ మేనిషెస్టో దగ్గరపెట్టుకొని బాబు సరిచూసుకోవాలని ఆయన సూచించారు. రూ.87 వేల కోట్ల రైతు రుణాలను రూ.24 వేల కోట్లకు కుదించారని తెలిపారు. కమిటీలు వేసి మాఫీ చేయకుండా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. 
 
Back to Top