స్వాతంత్ర ఫలాలు అందరికి చేరాలి

 


- వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు
 
 హైదరాబాద్‌ : స‌్వాతంత్ర ఫ‌లాలు అంద‌రికీ చేరాల‌ని, దేశం కోసం ఎంతోమంది వీరులు ప్రాణాలు అర్పించారని, వారి చరిత్రను చూసి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరముందని ఏపీ శాసనమండలి ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. దేశ 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంత‌రం ఉమ్మారెడ్డి  మాట్లాడుతూ.. దేశ జనాభాకు అనుగుణంగా ఆర్థిక వనరులు పెరగాలని, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగాలని అన్నారు. మహిళలపై అత్యాచారాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కక్షలు పెరిగిపోతున్నాయి. దేశ సంపద కొంత మంది చేతిలోనే ఉండిపోతోంది. స్వాతంత్ర ఫలాలు అందరికి చేరాలి. దోపిడిలు, దుర్మార్గాలు ఎక్కువయ్యాయి. 

రాజకీయ వ్యవస్థకు నూతన నిర్వచనాలు ఇస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల దగ్గర నుంచి అన్నీ రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. పేదలను పట్టించుకోవడం లేదు. ఆరోగ్యం, విద్యకు మహానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. వైయ‌స్ఆర్‌ పాదయాత్ర చారిత్రాత్మకమైనది. వైయ‌స్ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా సాగాలి. ఉభయ రాష్ట్రాలు అన్ని రంగాల్లో ముందుండాలి’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు వాసిరెడ్డి పద్మ, రెహమాన్, గట్టు శ్రీకాంత్ రెడ్డి, పుత్త ప్రతాప్ రెడ్డి, లక్ష్మీ పార్వతి తదితరులు పాల్గొన్నారు.
Back to Top