నవరత్నాలతో అన్నివర్గాలకు మేలు

అనంతపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజలు మేలు జరుగనుందని వైయస్‌ఆర్‌ సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం సుబ్బారాయునిపల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రకాష్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని నవరత్నాల గురించి వివరించారు. అన్ని సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని వైయస్‌ జగన్‌ నవరత్నాలను ప్రవేశపెట్టారన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సువర్ణ పాలన మళ్లీ రావాలంటే వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. 
Back to Top