గ్లోబెల్స్‌ ప్రచారాన్ని మానుకోండి

 
విజయవాడ:  టీడీపీ మంత్రులు గ్లోబెల్‌ ప్రచారాన్ని మానుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌బాబు సూచించారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతపై నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని సూచించారు. సీఎం చంద్రబాబే కాంగ్రెస్‌ పొత్తులపై చర్చించినట్లు తోక పత్రికలో వార్తలు రావడంతో.. టీడీపీ– కాంగ్రెస్‌ పొత్తులపై వైయస్‌ జగన్‌ ఆరో పెళ్లిగా అభివర్ణించారని,  ఇదేమి తప్పు కాదని తెలిపారు. ఎన్‌టీఆర్‌ నుంచి అధికారం లాక్కున్న చంద్రబాబుకు అది ఒకటో పెళ్లి అని, బీజేపీతో రెండో పెళ్లి..ఇలా టీడీపీ పొత్తులపై పెళ్లిగా వైయస్‌ జగన్‌ వివరించారని తెలిపారని చెప్పారు.

  
 
Back to Top