ముద్రగడ చేత కన్నీళ్లు పెట్టించింది మీరు కాదా బాబూ?


– కాపుల రిజర్వేషన్ల అంశంలో వైయస్‌ జగన్‌పై తప్పుడు ప్రచారం
– కాపు రిజర్వేషన్లపై గత ఎన్నికల్లో టీడీపీ హామీ ఇవ్వలేదా?
– ఒక్క హామీ అయినా చంద్రబాబు నెరవేర్చారా?
- వంగవీటి మోహన రంగాను చంపించింది చంద్రబాబు కాదా
– రెండు రోజులు హైదరాబాద్‌లో ఉండే ధైర్యం చంద్రబాబుకు ఉందా?
– రాజకీయ విధానాలపై చర్చకు చంద్రబాబు సిద్ధమా?

విజయవాడ: కాపులకు  ఇచ్చిన వాగ్ధానం నెరవేర్చాలని పోరాటం చేసిన కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చేత కన్నీళ్లు పెట్టించింది చంద్రబాబు కాదా అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌బాబు ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్లపై టీడీపీ గత ఎన్నికల్లో హామీ ఇవ్వలేదా అని నిలదీశారు. కాపుల రిజర్వేషన్ల అంశంలో వైయస్‌ జగన్‌పై తప్పుడు ప్రచారం మానుకోవాలని ఆయన హితవు పలికారు. బుధవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నిన్న గ్రామ దర్శిని కార్యక్రమంలో వైయస్‌ జగన్‌పై చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారని తప్పుపట్టారు. గ్రామ దర్శిని ఉద్దేశాన్ని చెప్పాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు దారి తప్పి ప్రతిపక్ష నాయకులు వైయస్‌ జగన్‌ లక్ష్యంగా వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు అన్నారు. కాపుల రిజర్వేషన్ల అంశంలో మేం మాట మార్చినట్లు, యూటర్న్‌ తీసుకున్నట్లు ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారన్నారు. చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నామని, మీరు ఇచ్చిన 650 హామీల్లో ప్రధానమైన వాటిలో కాపుల రిజర్వేషన్‌ అంశం ఉందా లేదా అన్నారు. నరేంద్రమోడీతో కలిసి హామీ ఇచ్చిన చంద్రబాబు సమయం కూడా స్పష్టంగా చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కాపులను బీసీ జాబితాలో చేర్చుతామని చెప్పింది వాస్తవం కాదా అని నిలదీశారు. చంద్రబాబు, తనకు అనుకూలమైన ఎల్లోమీడియా ద్వారా వైయస్‌ జగన్‌ వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. మీ వాగ్ధానాలు నమ్మి కాపులు ఓట్లు వేశారని,  చంద్రబాబు కాపులను మోసం చేశారని మండిపడ్డారు. సీఎం ఇచ్చిన ఏ హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదన్నది వాస్తవం కాదా అన్నారు. టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని నెరవేర్చానని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రతి కులానికి కూడా చంద్రబాబు వాగ్ధానం  ఇచ్చి మోసం చేశారన్నారు. ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చకుండా ప్రతిపక్ష నాయకులుపై విమర్శలు చేయడం దారుణమన్నారు. 
– వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మొదటి నుంచి కూడా కాపుల రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదని స్పష్టంగా చెప్పారని సుధాకర్‌బాబు గుర్తు చేశారు. రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలో ఉందని, కేంద్రంపై పోరాటం చేయాల్సిన బాధ్యత ఓట్లు వేయించుకున్న టీడీపీపై ఉందని తెలిపారు. మా వంతు బాధ్యతగా అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు పలికిందన్నారు. ఈ అంశంపై కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. కేంద్రంతో కలిసి నాలుగేళ్లు సంసారం చేసిన చంద్రబాబు ఈ రోజు తన చేతకాని తనాన్ని, దద్దమ్మ పనిని ప్రతిపక్షంపై రుద్దడం సరైంది కాదన్నారు. ఆ రోజు ముద్రగడను గృహ నిర్భందం చేశారన్నారు. ఈ రోజు ఆయన టర్న్‌ తీసుకొఒని ఉండవచ్చు అని, కానీ వైయస్‌ జగన్‌ ఈ రోజు వరకు కాపులకు అండగా నిలిచారన్నారు.
– వంగవీటి మోహన రంగాను చంపించింది చంద్రబాబు కాదా అని సుధాకర్‌బాబు ప్రశ్నించారు. ఈ ధైర్యం విజయవాడలోని రాధా ఇంటి ముందు నిలిచి చెప్పే ధైర్యం ఉందా చంద్రబాబు అని సవాల్‌ విసిరారు. జక్కంపూడి రాజాను చొక్కా చినిగేలా కొట్టించింది మీరు కాదా అన్నారు. ముద్రగడను గృహ నిర్భందం చేసిన సమయంలో ఆయన కళ్ల నీళ్లు పెట్టుకొని మీడియా ముందు మీ గురించి చెప్పింది వాస్తవం కాదా అన్నారు. 
– కాపులకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎంతో చేశారన్నారు. ఆయన బాటలోనే వైయస్‌ జగన్‌ కూడా రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారని వివరించారు. వైయస్‌ జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సుధాకర్‌బాబు డిమాండు చేశారు. వైయస్‌ జగన్‌పై విమర్శలు చేసే చంద్రబాబు హైదరాబాద్‌లో రెండు రోజులు ఉండే ధైర్యం ఉందా అని సవాలు విసిరారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రపై చంద్రబాబు చేతకాని వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. రాజకీయ విధానాలపై చంద్రబాబు చర్చకు సిద్ధమా అని డిమాండు చేశారు. 
 
Back to Top