వందల కోట్ల ప్రజాధనాన్ని దోచేశారు

కొవ్వూరులోకి ప్రవేశించనున్న ప్రజా సంకల్పయాత్ర 
జననేతకు స్వాగతం పలికేందుకు తండోతండాలు తరలివచ్చిన జనం

పశ్చిమగోదావరి: ఇసుక, మట్టి, మద్యం మాఫియాతో టీడీపీ నేతలు వందల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త వనిత ఆరోపించారు. ప్రజల కష్టాలను కడతేర్చేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర నేడు కొవ్వూరులో ప్రవేశించనుంది. జననేత పాదయాత్రకు స్వాగతం పలికేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ సందర్భంగా వనిత మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రధానంగా చాగల్లు మండలంలో చాగల్లు షుగర్‌ ఫ్యాక్టరీ మూతపడింది. కార్మికులు జీతాలు లేక అల్లాడుతున్నారు. అంతే కాకుండా ఫ్యాక్టరీకి చెరుకు తోలిన రైతులకు కూడా బకాయిలు అందకపోవడంతో వారు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారంతా వైయస్‌ జగన్‌ను కలిసి సమస్యలను చెప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అదే విధంగా డ్వాక్రా సంఘాలు, ఆశా వర్కర్లు వారి సమస్యను జననేతకు వివరించేందుకు ముందుకు వచ్చారన్నారు.

వైయస్‌ జగన్‌ పశ్చిమ గోదావరి జిల్లాలోకి అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు అశేష జనవాహిని నడుమ పాదయాత్ర సాగుతుందని వనిత అన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, దీనికి ప్రధాన కారణం ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతేనన్నారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలు ఇప్పటికీ నెరవేర్చకపోవడంతో ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారన్నారు. జననేతకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణే 2019 ఎన్నికల్లో ఆయన్ను ముఖ్యమంత్రిని చేస్తుందన్నారు. 

తాజా వీడియోలు

Back to Top