వంచనకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు

వైయస్‌ జగన్‌ పాదయాత్రకు చరిత్రలో సుస్థిర స్థానం
వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత తమ్మినేని సీతారాం
గుంటూరు: పరిపాలన చేయమని గద్దెనెక్కించిన ముఖ్యమంత్రిపైనే రాష్ట్ర ప్రజలు పోరాటం చేయాల్సిన దుస్థితిని చంద్రబాబు తీసుకువచ్చారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత తమ్మినేని సీతారాం అన్నారు. చంద్రబాబు వంచనకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పేరు పొందారన్నారు. గుంటూరులో జరుగుతున్న వంచనపై గర్జన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సుదీర్ఘకాలం ప్రజల మధ్యన ఉంటూ పాదయాత్ర చేస్తున్న గొప్ప నాయకుడిగా దేశ చరిత్రలో వైయస్‌ జగన్‌ సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు. నయవంచనకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. నేను మారాను.. మీరు మారండి.. అనుభవం ఉంది ఒక్క అవకాశం ఇవ్వండి అని నమ్మించి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. మాయమాటలు నమ్మి జనం ఓటేసి అధికారం కట్టబెడితే చంద్రబాబు వెలగబెట్టిన నిర్వాకం ఏంటంటే.. అన్ని వర్గాలను నయవంచనతో మోసం చేసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 

అబద్ధాలు, అన్యాయాలు, అక్రమాలతో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు రాష్ట్రాన్ని పూర్తిగా ముంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలను సభలోనే నిర్లజ్జగా, నిసిగ్గుగా ఫ్లోర్‌ క్రాస్‌ చేయించారన్నారు. రాష్ట్రంలో పంచాయతీ రాజ్‌ వ్యవస్థ సర్వనాశనం అయిందని, జన్మభూమి కమిటీలను నియమించి సర్పంచ్‌ల వ్యవస్థను నాశనం చేశారన్నారు. నాలుగేళ్లుగా అవినీతికి పాల్పడుతున్న దొంగను ఆధారాలతో సహా వైయస్‌ జగన్‌ రోడ్డున నిలబెట్టారన్నారు. గాంధీజీ మార్గంలో తాను నమ్మిన సిద్ధాంతం కోసం వైయస్‌ జగన్‌ పోరాడుతున్నారని, నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చేందుకు ఉద్యమం చేస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. 
Back to Top