పిట్టల దొరల వేషాలు వేసినా రైతులు నమ్మరు

చంద్రబాబుపై వైయస్‌ఆర్‌ సీపీ అధికారప్రతినిధి తమ్మినేని సీతారాం ధ్వజం
శ్రీకాకుళం: పిట్టల దొరలా వేషం వేసుకొని.. ఏరువాక పూజలు చేస్తే ప్రజలు ఎవరూ నమ్మరు చంద్రబాబూ అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. వ్యవసాయమే దండగ అని నాలుగేళ్లుగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించని చంద్రబాబు ఇవాళ నీతి సూక్తులు చెప్పడం సిగ్గుచేటన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతురుణమాఫీ అని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ వాగ్ధానాన్ని విస్మరించాడని మండిపడ్డారు. రాష్ట్రం మొత్తం రూ. 87 వేల కోట్ల రుణాలకు కేవలం రూ. 13 వందల కోట్లు మాత్రమే చేసి అన్ని చేసినట్లుగా ప్రకటించుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. రైతులకు సరిపడా విత్తనాలు సరఫరా చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని... వేషాలు వేసుకుంటూ వస్తే రైతులు నమ్మే పరిస్థితిల్లో లేరన్నారు. చంద్రబాబు చేసిన మోసం వల్ల వారి ఆర్థిక పరిస్థితి దెబ్బతిందన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సువర్ణ పరిపాలన రావాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే వ్యవసాయం దండగ కాదు.. పండుగలా జరిపిస్తారన్నారు. 
Back to Top