బాబు రాజకీయ వ్యభిచారి కంటే ఎక్కువ

తొలి సంతకం సక్రమంగా అమలు చేయలేని అసమర్థుడు
నాలుగేళ్ల పాలనలో వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టించాడు
రైతు రుణమాఫీ చేస్తానని వ్యవసాయాన్నే నాశనం చేశాడు
రాష్ట్రంలో నారావారి సారా స్రవంతి ఏరులై పారుతోంది
నాలుగేళ్లయినా ఉద్యోగం లేదు.. నిరుద్యోగ భృతి లేదు
పోలవరం నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు అంత తీట
నీరు–చెట్టు పేరుతో పచ్చపందికొక్కుల మేతలకు నిధులు మళ్లింపు
నాలుగేళ్లు ఐసీయూలో ఉన్న టీడీపీకి మరణమే శరణ్యం
చంద్రబాబు మోసాలపై వైయస్‌ఆర్‌ సీపీ చార్జిషీట్‌ విడుదల
విజయవాడ: చంద్రబాబు ఓ రాజకీయ వ్యభిచారి అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం ఆరోపించారు. నాలుగేళ్లుగా చంద్రబాబు తన పాలనలో వ్యవస్థలను భ్రష్టుపట్టించాడన్నారు. మొట్టమొదట తొలి సంతకంతో ప్రారంభమైన చంద్రబాబు పాలన నాలుగేళ్లు పూర్తి చేసుకుందని, ఆ తొలి సంతకాన్ని సక్రమంగా అమలు చేయలేకపోయిన అసమర్థ పాలన బాబుదన్నారు. విజయవాడలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో తమ్మినేని విలేకరుల సమావేశం నిర్వహించారు. అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు చంద్రబాబు ఆకృత్యాలపై తమ్మినేని సీతారాం పార్టీ నేతలు జోగి రమేష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, లేళ్ల అప్పిరెడ్డి, సుధాకర్‌బాబులతో కలిసి చార్జిషీట్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారో.. ఆయన మాటల్లోనే.. 

రైతురుణాలు మాఫీ చేయడానికి తొలి సంతకం చేస్తానని ఎన్నికల సభల్లో చంద్రబాబు హోరెత్తించారు. 
తీరా చూస్తే తొలి సంతకమే సక్రమంగా అమలు చేయలేకపోయారు. కోటయ్య కమిటీ వేసి విధి విధానాలు రూపొందిస్తామన్నారు. రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పారు. రూ. 87 వేల కోట్ల పైచిలుకు రుణాలు మాఫీ చేస్తామని ప్రజలకు ఇచ్చిన మాటను తప్పారు. రూ. 87 వేల కోట్ల పైచిలుకు ఉన్న రుణమాఫీపై అనేక షరతులు విధించి రూ. 24 వేల కోట్లకు దించారు. అమలులోకి వచ్చే సరికి రూ. 13 వేల కోట్లకు కుదించి రుణాలన్నీ మాఫీ పూర్తిగా చేశామని చెబుతున్నారు.

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి వెన్నుచూపకుండా రైతు రుణాలు పైసా లేకుండా మాఫీ చేశారు. కానీ చంద్రబాబు తొలిసంతకం  ఇప్పటికీ చివరి సంతకంగా మిగిలిపోయింది. 
డ్వాక్రా రుణమాఫీ చేస్తామని, ఆడపడుచులకు అన్నగా మాటిస్తున్నానని చెప్పి నమ్మించి.. వంచించి వారి ఓట్లు దండుకొని నేను రుణాలు మాఫీ చేయలేను కానీ.. మూలధనంగా రూ. 10వేలు ఇస్తానన్నారు.  కొంతకాలం తరువాత రూ. 3వేలు ఇస్తానన్నాడు. ఆ డబ్బు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. పసుపు కుంకుమల కింద ఇస్తున్నానంటున్నాడు.. ఆడపడుచుల తల్లిదండ్రులు, అన్నదమ్ములు పసుపు కుంకుమలు పెట్టలేదా..? పచ్చి అబద్ధాలు ఆడి అది కూడా ముట్టుకోకుండా వీల్లేకుండా చేశాడు. 
బాబు వస్తేనే జాబు వస్తుందని చెప్పిన చంద్రబాబు 1.45 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని, వారందరికీ ఉద్యోగాలు ఇస్తామని, ఇవ్వలేకపోతే రూ. 2 వేల భృతి కల్పిస్తామని చెప్పారు. వాటికి కూడా షరతులు పెట్టి రూ. వెయ్యి ప్రకారం 10 లక్షల మందికి కుదించారు. నాలుగేళ్లుగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ చంద్రబాబుæ నెరవేర్చలేదు. టీడీపీ మేనిఫెస్టో గవర్నమెంట్‌ నెట్‌లో నుంచి తొలగించారు. నిజాయితీ ఉంటే వాగ్ధానాలు నెరవేర్చామని చెప్పే ధైర్యం లేని పరిస్థితుల్లో నెట్‌లో మేనిఫెస్టో మాయం చేశారు. 
 
భారతదేశంలోనే అత్యంత అవినీతి ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఓ సంస్థ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ అవినీతిలో రెండో స్థానంలో ఉందని మరో సంస్థ వెల్లడించింది. ఇవన్నీ వైయస్‌ఆర్‌ సీపీ చెప్పినవి కాదు.. గుర్తింపు పొందిన సంస్థలు వెల్లడించాయి.
పురుషోత్తపట్నం, పట్టిసీమ, పోలవరం అన్నీంట్లో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. కేంద్రం ప్రభుత్వం నిర్మించి ఇవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టును మీరెందుకు తీసుకున్నారు చంద్రబాబూ. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టులను మీరెందుకు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు అంత తీట. మీ తాబేదారులకు కాంట్రాక్టర్‌లకు ఇచ్చుకొని పెద్ద ఎత్తున ప్యాకేజీలు దండుకునే అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారు. 

నీరు– చెట్టు పేరుతో సుమారు వందల కోట్లు కాజేశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను మళ్లించి పచ్చ పందికొక్కులు మేతకు నిధులు ఇస్తున్నారు. ఇది ప్రజల డబ్బు కాదా బాబూ..? ఇష్టం వచ్చినట్లు డైవర్ట్‌ చేసుకోవచ్చా..? ఎస్సీ, ఎస్టీ నిధులు కూడా డైవర్ట్‌ చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టుపట్టించారు. పంచాయతీల్లో సర్పంచ్‌లను ప్రజలను ఎన్నుకుంటే.. వారిపై జన్మభూమి కమిటీలను వేశారు. రాజీవ్‌గాంధీ 74, 75 రాజ్యాంగ సవరణలతో పంచాయతీలకు అధికారం కల్పించారు. జన్మభూమి కమిటీలను వేసి వారిని అస్థిపంజరాలు చేశారు. దీన్ని మీ విజయం కింద భావిస్తూ చెప్పుకుంటున్నారా..? 

వైయస్‌ఆర్‌ సీపీ సర్పంచ్‌ల చెక్‌ పవర్‌లను తొలగించారు. గోపాల మిత్రులను, రైతు మిత్రులను, ఫీల్డ్‌ అసిస్టెంట్లను, మధ్యాహ్నం భోజన పథకంలో ఆయాలుగా పనిచేస్తున్న కార్మికులను వైయస్‌ఆర్‌ సీపీ ముంద్ర వేసి తొలగించారు. మీ అనైతిక పరిస్థితిని ఏమనాలి? ఇది కూడా మీ విజయాల కిందే వేసుకుంటారా..? 
 
గవర్నర్, స్పీకర్, అసెంబ్లీ, పోలీస్‌ వ్యవస్థను, ఐఏఎస్‌ అధికారులు, రెవెన్యూ అధికారుల వ్యవస్థలను భ్రష్టుపట్టించారు. అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిన ప్రభుత్వం నవనిర్మాణ దీక్ష చేస్తున్నారు. దేనికి ఈ దీక్షలు కొంత పుంతలో అవినీతి ఎలా చేయాలని మార్గదర్శకాన్ని నిర్దేశిస్తున్నారా..? నలుగురిని సంపాదించుకో.. చివరకు మోసుకుపోవడానికి ఉపయోగపడతారని పెద్దలు చెబుతారు. టీడీపీ ప్రభుత్వానికి జన్మభూమి కమిటీల నలుగురే పాడేకట్టి శ్మశానంలో చితిమంటలు పెడతారు. ప్రభుత్వం నాలుగేళ్లుగా ఐసీయూలో ఉంది.. దీనికి మరణమే శరణ్యం. 

పరిశ్రమల పేరిట విశాఖలో నాలుగు సమ్మిట్‌లు పెట్టి 8 వేల పైచిలుకు ఎంఓయూలు కుదుర్చుకున్నారు. రూ. 16 లక్షల కోట్ల విలువ కలిగిన ఆర్థిక ప్రయోజనాలని అగ్రిమెంట్లు చేసుకున్నారు. 36 లక్షల 8 వేల పైచికులు ఉద్యోగాలు దొరుకుతాయని చంద్రబాబు ఊదరగొట్టారు. ఏఏ దేశాలతో.. ఏయే పరిశ్రమలకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.. దయచేసి ప్రభుత్వం తెలియజేయాలి. దమ్ముంటే, నిజాయితీ ఉంటే.. ఒప్పందాలతో ప్రయోజనాలు జరుగుతాయే విశ్వసనీయ ఉంటే శ్వేతపత్రాలు విడుదల చేయండి. 

23 మంది వైయస్‌ఆర్‌ సీపీ శాసనసభ్యులను రూ. 35–40 కోట్ల వరకు వెచ్చించి సంతలో పశువులు కొన్నట్లుగా కొన్నారు. ఫిరాయింపుదారుల సభ్యత్వం రద్దు చేయాలని స్పీకర్‌ను కోరితే దాటవేసుకుంటూ వస్తున్నారు. కానీ ఈ రోజుకు అసెంబ్లీలో వారి స్థానాలను మార్చగలిగారా..? ఇప్పటికీ వారు వైయస్‌ఆర్‌ సీపీపై గెలిచినట్లుగా ఉంది. ఫ్యాన్‌ గుర్తుపై వైయస్‌ జగన్‌ దయతో గెలిచిన ఫిరాయింపుదారులు చీమూ నెత్తురు ఉన్నా.. లజ్జా, సిగ్గు ఉన్నా.. రాజీనామాలు చేసి ఉపఎన్నికల్లో పోటీ చేయాలి. అదే రాజకీయ విలువలు. గతంలో వైయస్‌ఆర్‌ సీపీలోకి వచ్చిన వారితో వైయస్‌ జగన్‌ రాజీనామాలు చేయించి పార్టీలోకి తీసుకొని ఉప ఎన్నికలకు వెళ్లారు. నంద్యాలలో ఎమ్మెల్సీ చక్రపాణిని రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకున్నారు. ఇది వైయస్‌ఆర్‌ సీపీ పొలిటికల్‌ ఎథిక్స్‌. 
 
చంద్రబాబు రాజకీయ వ్యభిచారి.. బాబుకు పిల్లనిచ్చిన మామ.. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆరే చెప్పారు. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు చెప్పాం నోయూజ్‌.. స్పీకర్‌కు చెప్పాం నోయూజ్‌.. అన్ని వ్యవస్థలకు మొరపెట్టుకున్నాం ఫలితం లేదు. చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలను మ్యానేజ్‌ చేసుకొని పాలన సాగిస్తున్నారు తప్ప ప్రజామోదం లేదు.. టీడీపీకి ఏమాత్రమైనా ప్రజామోదం ఉంటే.. ప్రజాస్వామ్యంపై విశ్వసనీయత ఉంటే ఇప్పటికైనా ఫిరాయింపుదారులపై రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలి. గెలిపించుకోగల సత్తా ఉంటే ఎన్నికలకు రావాలి. 
 
పోలీస్‌ స్టేషన్‌లో అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు దారుడిని నీది తెలుగుదేశమా.. వైయస్‌ఆర్‌ సీపీనా అని అడుగుతున్నారు.. అన్యాయం జరిగిందని ఎక్కడకు వెళ్లినా ఏ పార్టీకి చెందిన వాడివని అడుగుతున్నారు. బాబు పాలనలో పోలీస్‌ వ్యవస్థ ఇంత దుర్భరంగా తయారైంది. ఇసుక మాఫియా చేయడానికి వీల్లేదని అడ్డుకున్నా ఎమ్మార్వో వనజాక్షిపై ఎమ్మెల్యే తెగబలిసి దాడి చేస్తే చర్య తీసుకోలేని చేతగాని ప్రభుత్వం.. పైగా ఎమ్మెల్యేలు చేసిన అన్యాయానికి, అవినీతికి రేటింగ్‌ ఇస్తున్నారు. గుడ్లు అప్పగించి చూసిన ముఖ్యమంత్రి నీ అంత అసమర్థ ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా..?

ఎన్టీఆర్‌ సృజల స్రవంతి ఎక్కడ కనిపించడం లేదు కానీ.. నారావారి సారా స్రవంతి ఏరులై నిరుపేద కుటుంబాలను దహిస్తుంది. సిగ్గులేదా  చంద్రబాబు ఎక్కడైనా ఎన్టీఆర్‌ పేరుతో పెట్టిన పథకం సృజల స్రవంతి కనిపిస్తుందా..? ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను మాఫియాగా తయారు చేసి అందినకాడికి దండుకోమని చెప్పి.. మళ్లీ నవ నిర్మాణ దీక్ష అని దొంగ దీక్షలు చేస్తున్నాడు. అవినీతిలో నవ నిర్మాణమా.. మట్టి, ఇసుక అమ్ముకోవడంలో నవ నిర్మాణమా.. లిక్కర్‌ మాఫియాలో నవ నిర్మాణమా.. దేనికి మీ దీక్ష. 
మీ అవినీతి ఏ స్థాయిలో ఉందో చంద్రబాబు ఆలోచించుకోవాలి. వైయస్‌ఆర్‌ సీపీ ఎజెండా వారిగా చార్జిషీట్‌ విడుదల చేసింది. దమ్ముంటే చంద్రబాబు దీన్ని ఖండించమనండి చూద్దాం. రాష్ట్రంలో పెద్ద రైతులు చిన్న రైతులుగానూ.. చిన్న రైతులు కూలీలుగానూ.. వ్యవసాయ కూలీలు ఇతర రాష్ట్రాల్లో భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నారు. ఎవరికీ ఉపాధి దొరకని పరిస్థితి నెలకొంది.  
 

తాజా వీడియోలు

Back to Top