బాబూ..నీకు మానవతావాదం లేదా?

శ్రీకాకుళం:

ఉద్ధానం కిడ్నీ బాధితులను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని, ఆయనకు మానవతావాదం లేదా అని వైయస్‌ఆర్‌సీపీ హై పవర్‌ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హార్వర్డ్‌ యూనివర్సిటీ డాక్టర్లు కిడ్నీ వ్యాధికి మూలాలు ఏంటని పరిశోధన జరిపి, నివేదికను ప్రభుత్వానికి ఇస్తారని, ప్రభుత్వం చర్యలు తీసుకొని కిడ్నీ వ్యాధులను రూపుమాపుతామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. అయితే వారు చేసింది ఏమీ లేదని ధ్వజమెత్తారు. ఇవాళ ప్రభుత్వం దారుణంగా అబద్ధాలు అడుతోందన్నారు. గతంలో ప్రభుత్వం వేసిన వైద్య కమిటీలో సభ్యులే ఉన్నారని, కొత్త వారికి అవకాశం ఇవ్వలేదన్నారు. హర్వర్డ్‌ యూనివర్సిటీ సభ్యులతో రీసర్స్‌ చేశామని చెప్పి చేతులు దులుపుకున్నారే తప్ప..దీంట్లో కొత్తగా చేసింది ఏమీ లేదన్నారు. ఒక్క గ్రామాన్ని, ఒక్క రోగిని కూడా సందర్శించిన పాపాన పోలేదని విమర్శించారు. సోంపేట మండలంలో ఒక్క మీటింగ్‌ పెట్టి ఈ కార్యక్రమాన్ని మమ అనిపించారన్నారు. ఆ తరువాత ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు. ఉద్దానాన్ని ఉద్దరిస్తున్నామని పెద్ద బిల్డప్‌ఇచ్చారన్నారు. మునుపటి కంటే ఆ బాధితుల పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు. ఈ మాత్రం మీటింగ్‌ కోసం పత్రికలో విసృ›్తతంగా ప్రచారం చేశారని తప్పుపట్టారు. సమస్య పరిష్కారం అవుతుందని మంత్రులు, మీడియా ఊదరగొట్టిందని మండిపడ్డారు. మొత్తం ఉద్దానం ప్రాంతంలో ఏడు మండలాలు ఉన్నాయి. 1.25 లక్షల శాంపిల్స్‌ సేకరించారు. 10600 మందికి వ్యాధి తీవ్రత ఉందని కేటగిరిలుగా విభజించారు. ఒక కిడ్నీ పేషెంట్‌ను బతికించాలంటే డయాలసిస్, రక్త మార్పిడి ద్వారా వారి ఆయుస్సు పెంచే అవకాశం ఉందన్నారు. ఉద్దానం ప్రాంతంలో మెరుగైన వైద్యం లేక మళ్లి విశాఖ పట్నంకు తరలిస్తున్నారు. స్థానిక ఆసుపత్రిలో సౌకర్యాలు లేకపోవడంతో అక్కడికి తీసుకెళ్తున్నారు. ఇక్కడేందుకు అర్భాటం చేయాలని ప్రశ్నించారు. కిడ్నీ బాధితులకు టోకరా వేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మీకు మానవతావాదం ఉందా అని నిలదీశారు?. చనిపోతామని ఆందోళనతో ఉన్న వారిని మోసం చేయడం ఎంతవరకు న్యాయమన్నారు. డాక్టరే ఆరోగ్యమంత్రిగా ఉన్నప్పటికి కిడ్నీ బాధితులకు న్యాయం జరగడం లేదు. ఇక్కడ ఒకే ఒక నెప్రాలజిస్టు ఉన్నారు. హర్వార్డ్‌ యూనివర్సిటీ నుంచి వచ్చిన డాక్టర్లకు ఇక్కడ నెప్రాలాజిస్టు లేరని చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. డయాలసిస్‌ సెంటర్లలో టెక్నిషియన్స్‌ లేరన్నారు. కిడ్నీ బాధితులను మోసం చేసిన చంద్రబాబుకు గుణపాఠం తప్పదని తమ్మినేని హెచ్చరించారు.

తాజా ఫోటోలు

Back to Top