చంద్రబాబు అక్రమాలపై సీబీఐ విచారణ చేయించాలి


–  కేంద్రాన్ని కోరిన వైయస్‌ఆర్‌సీపీ
– విచారణ చేయించాలని కేంద్రాన్ని కోరుతున్నాం
– అవినీతిపై చంద్రబాబు విచారణకు సిద్ధం కావాలి
– ఓటుకు కోట్లు కేసులో ఆ వాయిస్‌ చంద్రబాబుదే
– దేవుడిపై గౌరవం ఉంటే చంద్రబాబు కాణిపాకంలో ప్రమాణం చేయాలి
విజయవాడ: టీడీపీ నాలుగేళ్ల పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై చంద్రబాబుపై సీబీఐ విచారణ చేపట్టాలని వైయస్‌ఆర్‌సీపీ కేంద్రాన్ని కోరింది. విచారణకు చంద్రబాబు సిద్ధం కావాలని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు తమ్మినేని సీతారాం సూచించారు. గురువారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  రాష్ట్ర హక్కులను చంద్రబాబు కాలరాస్తున్నారని మండిపడ్డారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఉందని గుర్తు చేశారు. ఇవాళ అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేశారన్నారు. చంద్రబాబు చేసిన నేరాలు, ఘోరాలపై సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. రాష్ట్ర ప్రతిష్టను చంద్రబాబు మంటగలిపారన్నారు. మీతో భాగస్వామిగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌ మీ అవినీతిని చెప్పారన్నారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే విచారణకు సిద్ధం కావాలన్నారు. చంద్రబాబు జనం చెవిలో క్యాబేజి పెడుతున్నారన్నారు. ఎదుటి మనిషిపై చంద్రబాబు బురదజల్లుతూ..ఆయన మాత్రం సచ్చిలూడు అన్నట్లుగా నటిస్తున్నారన్నారు. నాకు, నీకు ఒకే ఒక కొడుకు ఉన్నారు. ఇద్దరం వెళ్లి కాణిపాకం వెళ్లి ప్రమాణం చేద్దాం. ఓటుకు కోట్లు కేసులో ఆ వాయిస్‌ నీదే అన్నారు. ప్రమాణం చేసే విషయంపై నీకు గౌరవం లేదన్నారు. దేవుడి మీద అయినా నీకు గౌరవం, భయం ఉంటే కాణిపాకం రావాలని సవాల్‌ విసిరారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలకు డిపాజిట్లు కూడా రావన్నారు. రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీలకు 27 అధికారాలు కట్టబెట్టారన్నారు. స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలు రావాలని, అందుకే నేరుగా పంచాయతీలకు నిధులు వెళ్లాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే..ఇవాళ జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేశారన్నారు. వీరేమైన స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారా? మదర్‌ ధెరిస్సా సంస్థ సభ్యులా? వాళ్లకు ఎందుకు అధికారం కట్టబెట్టారని మండిపడ్డారు.  టీడీపీ అక్రమాలపై న్యాయపోరాటాలు కొనసాగిస్తామన్నారు. 
 
Back to Top