వైయ‌స్ఆర్ వ్య‌వ‌సాయాన్ని పండ‌గ చేశారు


క‌డ‌ప మేయ‌ర్ సురేష్‌బాబు
వైయ‌స్ఆర్ జిల్లా:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాల‌న‌లో వ్య‌వ‌సాయాన్ని పండ‌గ చేశార‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు, క‌డ‌ప మేయ‌ర్ సురేష్‌బాబు పేర్కొన్నారు. క‌డ‌ప క‌లెక్ట‌రేట్ ఎదుట చేప‌ట్టిన ధ‌ర్నాలో ఆయ‌న మాట్లాడుతూ..చంద్ర‌బాబు పాల‌న‌లో వరుస కరువులను చవిచూస్తున్న రైతులకు పరిహారం మాత్రం సకాలంలో దక్కడం లేద‌న్నారు. 2013 నుంచి ఇప్పటి వరకు నష్టపోయిన వ్యవసాయ, ఉద్యాన పంటలకు జిల్లాకు  ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.56.08 కోట్లు జిల్లాకు రావాల్సి ఉంద‌న్నారు.  వ్యవసాయ పంటలకు రూ.45.87 కోట్లు కాగా, ఉద్యానవన పంటలకు రూ.10.21 కోట్లు అందాల్సి ఉంద‌ని చెప్పారు.  44 మండలాల్లోని 51వేల మందికిపైగా రైతులు నష్టపరిహారమైన ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం ఎదు చూస్తున్నార‌ని పేర్కొన్నారు. సకాలంలో చెల్లించి రైతులకు దన్నుగా నిలవాలనే దృక్పథం ప్రభుత్వంలో కన్పించడం లేదని మండిప‌డ్డారు.  మ‌ళ్లీ రాజ‌న్న రాజ్యం రావాలంటే వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాల్సిందే అని తెలిపారు.
Back to Top