అగ్రిగోల్డ్ బాధితుల‌కు న్యాయం చేయండి


విశాఖ‌ప‌ట్నం: త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ ధ‌ర్నా చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితుల‌కు య‌ల‌మంచిలి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య క‌ర్త బొడ్డేడ ప్ర‌సాద్ మ‌ద్ద‌తు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు వారి వెంటే ఉంటూ పోరాటం చేస్తామ‌న్నారు. తాను అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితుల‌కు న్యాయం చేస్తామ‌ని చెప్పి ఓట్లు వేయించుకుని అధికారంలో వ‌చ్చి నాలుగేళ్లు అవుతున్నా అగ్రిగోల్డ్ బాధితుల‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌న్నారు. అబ‌ద్ధాలు చెప్ప‌డం.. మోసం చేయ‌డం బాబు నైజమ‌ని, ఇలాంటి నాయ‌కుడు ఓటుతో బుద్ధి చెప్పాల‌ని ప్ర‌సాద్ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. బాధితుల‌కు అండ‌గా ఉంటూ పోరాటం చేస్తామ‌ని మ‌రోమారు స్ప‌ష్టం చేశారు. 
Back to Top