జగనన్న సీఎం అయితేనే రైతులకు న్యాయం

వైయ‌స్ఆర్ జిల్లా:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయితేనే రైతుల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని 
జమ్మలమడుగు సమన్వయకర్త సుధీర్‌ రెడ్డి పేర్కొన్నారు. క‌డ‌ప క‌లెక్ట‌రేట్ వ‌ద్ద నిర్వ‌హించిన ధ‌ర్నాలో ఆయ‌న  మాట్లాడుతూ..ఇంత వరకు జమ్మలమడుగులో ఒక్క విత్తనం కూడా వేయలేదని తెలిపారు. మా దగ్గర ఒక మంత్రి, ఒక విప్, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. వారు ఒక్క రోజు కూడా కరువు గురించి మాట్లాడలేదని మండిపడ్డారు. మంత్రి సాగునీరు తెచ్చేందుకు ప్రయత్నం చేయడం లేదని, కేవలం కమీషన్ల కోసం వెంపర్లాట తప్ప రైతుల గురించి ఆలోచించడం లేదని తీవ్రంగా ధ్వజమెత్తారు. 
Back to Top