చంద్రబాబు దొంగల పార్టీని నడుపుతున్నారు


విజయవాడ: చంద్రబాబు దొంగల పార్టీని నడుపుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు టీజేఆర్‌ సుధాకర్‌ బాబు విమర్శించారు. వైయస్‌ జగన్‌పై మంత్రి దేవినేని చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కనకదుర్గమ్మ వారధి వణికినప్పటి నుంచి టీడీపీ నేతలకు ప్యాంట్లు, లుంగీలు తడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. పట్టిసీమలో దోచుకున్నారని కాగ్‌ నివేదిక  ఇచ్చిందని..వైయస్‌ఆర్‌సీపీ కాదన్నారు. దేవినేని వదిన మృతిపై ఇప్పటికీ చాలా అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. బీజేపీతో పొత్తు అంటూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మరోసారి నోరు జారితే దేవినేని ఉమా ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కొని తెలంగాణలో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన దద్దమ్మలు టీడీపీ నేతలని ధ్వజమెత్తారు. 
 
Back to Top