పేదలను దోచుకుంటున్నారు

కడుబండి శ్రీనివాసరావు
విజయనగరం: చంద్రబాబు పాలనలో పేదలను దోచుకుంటున్నారని, స్థానిక ఎమ్మెల్యే అవినీతికి చిరునామాగా మారారని వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్‌ కడుబండి శ్రీనివాసరావు విమర్శించారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం కొత్త వలస పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 9 నియోజకవర్గాల్లో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పేదలకు మేలు జరిగిందన్నారు. చంద్రబాబు అదే పేద ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే కోలా లలిత కుమారి అవినీతికి చిరునామాగా మారారని ఆరోపించారు. రాజన్న రాజ్యం రావాలంటే వైయస్‌ జగన్‌ను ఆదరించాలని, వైయస్‌ఆర్‌సీపీని గెలిపించాలని కోరారు.
 
Back to Top