ప్రకృతి వ్యవసాయంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం

వాస్తవాలను పక్కదారి పట్టింస్తున్నారు..
వ్యవసాయాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబే..

హైదరాబాద్ః ప్రకృతి వ్యవసాయంపై చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత గడికోట శ్రీకాంత్‌ రెడ్డి విమర్శించారు. ఏపీలోని 2కోట్ల ఎకరాల్లో ప్రకృతి సేద్యం జరుగుతున్నట్లు  అంతర్జాతీయంగా అబద్ధాలను తీసుకెళ్తున్నారని దుయ్యబట్టారు.ఏపీలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని వాస్తవాలు చెప్పకుండా గొప్పలు  చెప్పుకోని అంతర్జాతీయంగా రాష్ట్రం పరువు దిగజారుస్తున్నారని ఆరోపించారు.మద్దతు ధర, ఇన్సూ్యరెన్స్, ఇన్‌పుట్‌ సబ్సిడీ, బ్యాంకులోన్లు ఇవ్వవలసిన పని ఉండదన్నట్లు ప్రకృతి సేద్యాన్ని నేనే కనుగొన్నానన్నట్లు చంద్రబాబు ప్రసంగాలు ఉంటున్నాయన్నారు. వ్యవసాయాని సర్వనాశనం చేసిన వ్యక్తి వ్యవసాయం గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తన పుస్తకంలోనే వ్యవసాయం దండగ అని రైతులంటే నాకు గిట్టదు అని పేర్కొన్న చంద్రబాబు అంతర్జాతీయ వేదికలపై వ్యవసాయం గురించి మాట్లాడటం ఒక దొంగ ఐపిసి సెక్షన్లు గురించి మాట్లాడినట్టేనన్నారు. మంచి చేసి గొప్పలు చెప్పితే బాగుంటుందని, వ్యవసాయాన్ని నాశనం చేసి గొప్పలు  మాట్లాడటం దారుణమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సోషియోæ ఎకానమిక్‌  సర్వే వాస్తవ రిపోర్డు ప్రకారం 61 వేల హెక్టార్లు ప్రకృతి సేద్యంలో ఉందని, వ్యసాయం రుణాలు మాఫీ చేయలేదని 87వేల కోట్లు రుణాలు లక్ష,25కోట్లకు వెళ్ళిదన్నారు.  అగ్రికల్చర్‌ బడ్జెట్‌లో  ఎరువుల వినియోగంలో ఆంధ్ర ఆరవ స్థానంలో ఉందన్నారు. బడ్జెట్‌లో  2022 నాటికి 5లక్షల హెక్టార్ల ఎకరాలను ప్రకృతి వ్యవసాయం మారుస్తామన్నారు. ఐక్యరాజ సమితితో 2 కోట్ల ఎకరాలకు 60 లక్షల రైతులను 2024కి చేస్తానన్నారు. సర్వేరిపోర్టులు,బడ్జెట్‌లకు పొంతన లేకుండా ప్రజలను మోసపుచ్చేవిధంగా అబద్ధాలు చెప్పుతున్నారన్నారు, రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నా, పశులకుల మేత లేకున్నా 14 ఎకరాల ఎండిపోతున్నా ఇవేం ప్రభుత్వానికి పట్టవని  అభివృద్ధి పేరుతో న్యూయార్క్‌లో పిడేలు వాయిస్తున్నారని విమర్శించారు.  ఐక్యరాజ సమితిలో వచ్చిరాని  ఇంగ్లీష్‌ దారుణంగా మాట్లాడి దేశ పరువును దిగజారుస్తున్నారని దుయ్యబట్టారు. ఐక్యరాజ్యసమితిలో ఒక సైడ్‌ హాలులో ప్రసంగిస్తూ హెప్‌ క్రియేట్‌ చేస్తున్నారన్నారు. అక్కడ ఎవరు అంతర్జాతీయ నాయకులు కనబడలేదన్నారు.పబ్లిసిటికి ప్రా«ధాన్యత ఇస్తున్నారే తప్ప. రైతుల సంక్షేమం గురించి ఆలోచించడంలేదన్నారు..అంతర్జాతీయంగా కోట్లు మూటగటుకోవడానికి విదేశీ పర్యటనలు చేస్తున్నారన్నారు..వైయస్‌ఆర్‌ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయకుండా రాజకీయాలు  చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి రెండువేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నా చంద్రబాబు.. 3లక్షల 75వేలు మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారని వారిలో 1 లక్ష మాత్రమే అర్హులన్ని చెప్పి చేతులు దులుపుకోవడం ఎంత మోసపూరితమో ప్రజలు తెలుసుకోవాలన్నారు. కోటిశ్వరులజాబితాలో నారా భువనేశ్వరి పేరిట 12 వందల కోట్ల ఆస్తిపరులని పేర్కొన్నారని,  2 ఎకరాల అసామి ఇప్పుడు 12 వందల కోట్ల ఆస్తులు సంపాదించడం వెనుక మర్మమేమిటని ప్రశ్నించారు..  ప్రత్యేకహోదా పేరుతో  ప్రజలను తప్పుదారి పట్టించడానికి టీడీపీ తూతూమంత్రంగా ఉద్యమాలు చేస్తోందన్నారు. 
Back to Top