రైతు మొహంలో సంతోషం నింపిన మహనీయుడు

బీడు భూములను వ్యవసాయ భూమిగా మార్చారు
వ్యవసాయం సస్యశ్యామలం చేసిన ఘనత వైయస్‌ఆర్‌దే
వైయస్‌ఆర్‌ ప్రాజెక్టులను తనవిగా చెప్పుకుంటున్న చంద్రబాబు
సిద్ధాపురం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ వైయస్‌ఆర్‌ చలవే
ఆత్మకూరు: రైతు మొహంలో సంతోషం చూడాలనే ఉద్దేశ్యంతో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం తీసుకొచ్చారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత శిల్పా చక్రపాణిరెడ్డి గుర్తు చేశారు. బీడు భూములు సస్యశ్యామలం చేసి రైతు కుటుంబాల్లో మహానేత వైయస్‌ఆర్‌ సంతోషం నింపాడని కొనియాడారు. శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో సిద్ధాపురం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ వద్ద గంగా హారతి కార్యక్రమం చేపట్టారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు తీసుకొచ్చి వాటిని వైయస్‌ఆర్‌ 90 శాతం మేరకు పూర్తి చేస్తే ఇప్పుడొచ్చిన చంద్రబాబు నేనే చేశానంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నిండి దాదాపు 200ల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసేదన్నారు. నీటిని రైతుల పొలాలకు మళ్లించాలనే ఉద్దేశ్యంతో వైయస్‌ఆర్‌ ఎస్‌ఆర్‌బీసీ, తెలుగుగంగా, కేసీకెనాల్, హంద్రీనీవా, గాలేరునగరి వంటి ప్రాజెక్టులను చేపట్టారన్నారు. ప్రాజెక్టలను నిర్మించి బీడు భూములను వ్యవసాయ భూములుగా మార్చిన ఘనత వైయస్‌ఆర్‌దన్నారు. 

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ప్రాజెక్టును 44 వేల క్యూసెకులకు పెంచిన ఘనత వైయస్‌ఆర్‌దని శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ఎస్‌ఆర్‌బీసీ ద్వారా లక్షా 60 వేల ఎకరాల బీడు భూములను పంట పొలాలుగా మార్చారన్నారు. 2003లో వైయస్‌ఆర్‌ సీపీ నేత శిల్పా మోహన్‌రెడ్డి గోరుకల్లు రిజర్వాయర్‌ నిర్మించాలని పెద్దిరెడ్డి చంగల్‌రెడ్డితో కలిసి 41 రోజుల పాటు నిరాహార దీక్షలు చేశారని గుర్తు చేశారు. గోరుకల్లు కడితే రైతుల కడగండ్లు తీర్చడానికి వీలుగా ఉంటుందని భావించారని, వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత గోరుకల్లు పూర్తి చేశారన్నారు. అదే విధంగా అవుకు రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 4.5 టీఎంసీలు చేసిన ఘనత వైయస్‌ఆర్‌ది. 

తెలుగుగంగ ప్రాజెక్టును పూర్తి చేసి కడప జిల్లాలోని ఎస్‌ఆర్‌–2 ద్వారా బ్రహ్మసాగర్‌కు 16 టీఎంసీల నీరు వైయస్‌ఆర్‌ ఇచ్చారని శిల్పా చక్రపాణిరెడ్డి గుర్తు చేశారు. అదే విధంగా ఎస్‌ఆర్‌–1 నుంచి పెన్నాలో నీటిని కలిపి నెల్లూరు సోమశిలకు నీరు మళ్లించారన్నారు. తెలుగుగంగా ప్రాజెక్టుకు రూ. 1,880 కోట్లు ఖర్చు చేసిన ఘనత వైయస్‌ఆర్‌దన్నారు. ఆ ప్రాజెక్టుల ముందు ఫొటోలు దిగి చంద్రబాబు మేమే చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు. 

ముచ్చుమ్రరి చెల్లికి మళ్లీ పెళ్లి అన్నట్లు చంద్రబాబు వ్యవహారం ఉందని శిల్పా చక్రపాణి ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు ముచ్చుమ్రరికి రెండుసార్లు ఓపెనింగ్‌ చేశారన్నారు. 790 అడుగులకు ప్రాజెక్టును డిజైన్‌ చేసి దాదాపు 85 శాతం పనులను వైయస్‌ఆర్‌ పూర్తి చేశారన్నారు. అదే విధంగా పోతిరెడ్డిపాడు, మల్యాల సామర్థ్యాలు పెంచి కేసీ కెనాల్‌కు 5 టీఎంసీల నీరు వచ్చేలా చేశారన్నారు. 2007లో సిద్ధాపురం ఎత్తిపోతల పథకం ప్రారంభించి రూ. 52 కోట్లు ఇచ్చిన ఘనత వైయస్‌ఆర్‌దని, తాను ఎమ్మెల్సీ అయిన తరువాత రూ. 32 కోట్లు ఇప్పిస్తే బుడ్డా రాజశేఖరరెడ్డి నేను చేశానని చెప్పుకుంటున్నాడని ధ్వజమెత్తారు. మా నాన్న కల అని కల్లబొల్లి మాటలు చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు సంచులకు అమ్ముడుపోయిన బుడ్డా రాజశేఖరరెడ్డి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. 

కుందు నదిని జీవనదిగా మార్చిన మహనీయుడు వైయస్‌ఆర్‌ అని శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. అలగనూరు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను వైయస్‌ఆర్‌ పూర్తి చేసి కుందునదిని జీవనదిగా మార్చారన్నారు.  హంద్రీనీవా సృజల స్రవంతికి రూ. 2,774 కోట్లు వెచ్చించి 13 స్టేజీలలో పథకాలను ప్రారంభించారన్నారు. అదే విధంగా గురు రాఘవేంద్ర ప్రాజెక్టును రూ. 79 కోట్లతో చేపట్టి 11 లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారన్నారు. అదే విధంగా గాలేరు నగరి అనే బ్రహ్మాండమైన ప్రాజెక్టును చేపట్టారన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేసిన వైయస్‌ఆర్‌ను ప్రజలంతా గుర్తు పెట్టుకోవాలన్నారు. రాయలసీమకు చేసిన మేలును రైతులు, ప్రజలంతా తలచుకుంటున్నారన్నారు. 

ప్రజల కష్టాలే తన కష్టాలు భావించి తండ్రి ఆశయాలను సాధించేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పేరుతో రాష్ట్రమంతా పర్యటిస్తున్నారని శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ప్రజలతో మమేకమై ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నారన్నారు. దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారన్నారు. వైయస్‌ఆర్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతుల మోహాల్లో సంతోషం చూడాలని, వ్యవసాయం దండగ కాదు.. పండుగ అనేలా చేసి చూపిస్తానని వైయస్‌ జగన్‌ హామీ ఇస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటా వరి రూ. 935 పలుకుతుంటే పండించిన రైతు కళ్లలో నీరు తిరుగుతుందన్నారు. గిట్టుబాటు ధరలపై ప్రభుత్వ మెడలు వంచేందుకు జిల్లా వ్యాప్తంగా వైయస్‌ఆర్‌ సీపీ నాయకులమంతా ఒక్కటిగా పోరాడుతామన్నారు. 

తాజా వీడియోలు

Back to Top