చంద్రబాబు నిరుద్యోగులను నిలువునా ముంచేశారు..

విజయవాడః ఎన్నికలు దగ్గరపడుతుండటంతోనే ఉద్యోగాల భర్తీ పేరుతో టీడీపీ ప్రభుత్వం డ్రామాలాడుతుందని వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నేతలు సలాంబాబు, అంజిరెడ్డి విమర్శించారు. లక్షలకు పైగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా కేవలం 20 వేల పోస్టులు భర్తీ చేయడం ఎంతవరుకు సమంజసమని ప్రశ్నించారు. నాలుగేళ్ల తర్వాత నోటిఫికేషన్‌ ఇచ్చి వయోపరిమితి  పెంచకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు నిరుద్యోగులను నిలువునా ముంచేశారని దుయ్యబట్టారు. 
Back to Top