2019 నాటికి పోలవరం ఎలా పూర్తి చేస్తారు బాబూ?




–  బాబు 9 ఏళ్లు సీఎంగా ఉన్న కాలంలో కర్నాటకలో ప్రాజెక్టులు కట్టుకున్నారు
– 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తానన్నారు..ఇప్పుడేమో 2019 అంటున్నారు
– పట్టిసీమ, పురుషోత్తంపట్టణానికి రూ.3400 కోట్లు ఖర్చు
– రూ.350 కోట్ల అవినీతి జరిగిందని కాగ్‌ రిపోర్టు ఇచ్చింది
– అవినీతి కోసమే శాశ్వత ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదు
– కమీషన్ల కోసం తాత్కాలిక ప్రాజెక్టులు కడుతున్నారు
– వైయస్‌ఆర్‌ హయాంలో 39 శాతం పోలవరం పనులు పూర్తి

హైదరాబాద్‌: 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తానని చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని, అప్పుడు ఆయన సీఎంగా ఉండరని, ఎలా పూర్తి చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.  పోలవరం ప్రాజెక్టు పూరై్తనట్లు చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గత తొమ్మిదేళ్ల పాలనలో ఏ రోజైనా ఆయన ప్రాజెక్టుల గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో చేసిన పనులను కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారన్నారు. సోమ‌వారం పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

ప్రాజెక్టులు, పోలవరం నా జీవిత ఆశయమని చంద్రబాబు చెబుతున్నారని, అయితే ఆయన రాజకీయ అనుభవంలో పిల్లనిచ్చిన మామను పదవీచ్యుతుడిని చేశారన్నారు. చంద్రబాబు ఏ రోజు కూడా ప్రాజెక్టుల గురించి ఆలోచించలేదన్నారు. కర్ణాటకలో విఫరీతంగా ప్రాజెక్టులు కట్టారన్నారు. వారు ఆల్మట్టి కట్టినా..చంద్రబాబు కలలు కంటూనే ఉన్నారన్నారు. ఆయన రాసుకున్న పుస్తకంలోనే చంద్రబాబు ప్రాజెక్టులను వ్యాపార దోరణీలోనే చూశారన్నారు. ఎకరాకు రూ.1080 ఖర్చు అవుతుందని, వసూలు మాత్రం అరకొర మాత్రమే అని వ్యాపార దృక్పథంలోనే చూశారన్నారు. సంకుచిత మనస్తత్వం కలిగిన చంద్రబాబు ఆ రోజు అలా ఆలోచించారన్నారు. ఈ రోజు పోలవరం వద్దకు వెళ్లి జాతికి అంకితం చేస్తున్నానని ప్రకటించారన్నారు. 2018 ఖరీఫ్‌లోగా గ్రావిటీ ద్వారా పోలవరం పూర్తి చేస్తానన్న చంద్రబాబు ..ఈ రోజు పోలవరాన్ని 2019కి వాయిదా వేశారన్నారు. గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తామని అంటున్నారు. ఆయనకు సంబం«ధంలోని లేని అంశాలపై కూడా వాగ్ధానాలు చేస్తున్నారన్నారు. 2014 నుంచి ఇంతవరకు ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. పట్టిసీమ, పురుషోత్తం పట్నం కోసం రూ.3400 కోట్లు ఖర్చు చేశారన్నారు. వీటికి కరెంటు కోసం రూ.1400 కోట్లు ఖర్చు చేశారన్నారు. రెండు తాత్కాలిక స్కీమ్‌లకు రూ.4800 కోట్లు ఖర్చు చేశారన్నారు. పోలవరం ఇప్పటికిప్పుడు పూర్తి చేయలేము..తాత్కాలిక స్కీముల ద్వారా నీరు ఇస్తామని చెప్పకుండా పోలవరం నుంచి నీళ్లు ఇస్తామని అబద్ధాలు చెబుతున్నారన్నారు. పోలవరంలో రూ.350 కోట్ల అవినీతి జరిగిందని కాగ్‌ నివేదిక వెల్లడించిందన్నారు. వ్యక్తిగత లాభం ఎక్కడ జరుగుతుందో అక్కడే తాత్కాలిక స్కీములు పెట్టారన్నారు. దీన్ని ఎవరు ప్రశ్నించకూడదన్నది చంద్రబాబు ఉద్దేశ్యమన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి ఖర్చు చేసింది రూ. 4800 కోట్లు మాత్రమే అన్నారు. మిగిలిన డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ఏ రకంగా 2019లో పూర్తి చేస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు హడావుడిగా చంద్రబాబు ఓ ప్రకటన చేశారన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. 2003లో కూడా ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు హడావుడిగా వెళ్లి దేవాదుల ప్రాజెక్టుకు భూమి పూజ చేసి అంతటితో ముగించారని గుర్తు చేశారు. వైయస్‌ఆర్‌సీపీ పోలవరంలో జాతీయ స్కాం జరుగుతుందని భావిస్తుందన్నారు. అక్రమార్జనకు పోలవరాన్ని సంజీవనిగా మార్చారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో గెలిచిస్తే పూర్తి చేస్తానని ప్రజలను మరోమారు మోసం చేస్తున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పోలవరానికి రూ.8 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు ఎప్పుడు, ఎక్కడ చెప్పడం లేదన్నారు. మహానేత తవ్విన కాల్వ ద్వారా పట్టిసీమకు నీరు పారించి తన ఘనతగా చంద్రబాబు చెప్పుకుంటున్నారని విమర్శించారు. పోలవరాన్ని కామాధేను మాదిరిగా నిధులు పిండుకునే ఆలోచన చంద్రబాబుకు ఉందన్నారు. విభజన చట్టం ప్రకారం పోలవరం మొత్తం ఆర్‌ అండ్‌ ఆర్‌ సహా ఇరిగేషన్‌ కాంపోనెంట్‌ వరకు కేంద్రమే భరించాలని రూపొందించారన్నారు. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు కమీషన్ల కోసం చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారన్నారు. ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ అంటూ పోలవరాన్ని తీసుకున్నారన్నారు. హడావుడిగా రూ. వెయ్యి కోట్లకు టెండర్‌ నోటీసులు ఇచ్చారన్నారు. ఎన్నికలు దగ్గరకు వచ్చాయి కాబట్టి ఇప్పుడు పోలవరం వద్దకు వెళ్లి హడావుడి చేస్తున్నారని విమర్శించారు. కరువు, అతివృష్టి, అనావృష్టితో ప్రజలు భయంకరమైన సంక్షోభంలో ఉంటే చంద్రబాబు మాత్రం గ్రాఫిక్స్‌తో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని భ్రమ కల్పిస్తున్నారన్నారు. 
 
Back to Top