ముస్లింలకు టీడీపీ చేసిందేమీ లేదు

విజయవాడలో వైయస్‌ఆర్‌ సీపీ మైనార్టీ కార్యవర్గ సమావేశం
విజయవాడ: చంద్రబాబు ముస్లిం సంక్షేమానికి చేసిందేమీ లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మండిపడ్డారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ మైనార్టీ సెల్‌ కార్యకర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు ముస్తఫా, అంజద్‌బాషా, ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ముస్లింలు రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వాటి పరిష్కారం.. అదే విధంగా పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. 
Back to Top