వైయస్‌ జగన్‌పై దాడి వెనుక టీడీపీ పాత్ర


– చంద్రబాబుకు మతి భ్రమించినట్టుంది
–హత్యాయత్నంపై డీజీపీ వ్యాఖ్యలు విచారకరం
– డీజీపీ స్టేట్‌మెంట్‌తో అనుమానాలు తలెత్తాయి
– నిందితుడి లేఖలో ఏముందో వెంటనే ఎందుకు చెప్పలేదు
– ఒక్కొ పేజీలో ఒక్కో హ్యాండ్‌ రైటింగ్‌ ఉంది
– సీఎంగా చంద్రబాబు అనర్హుడు
హైదరాబాద్‌: రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, డీజీపీ స్పందించిన తీరు బాధాకరమని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్ష నేతపై జరిగిన దాడికి సూత్రదారి అధికార టీడీపీ పార్టీనే అని, సీఎంగా కొనసాగడానికి చంద్రబాబు అనర్హుడని తేల్చి చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు వైయస్‌ఆర్‌సీపీపై బుదరజల్లుతున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.  వైయస్‌ జగన్‌పై జరిగిన దాడి కంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. విచక్షణా జ్ఞానం ఉండి ఆలోచించే వారు అందరూ కూడా చంద్రబాబు వెకిలితనాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ దుర్ఘటనపై ఒక నిష్పాక్షిత దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండు చేశారు. సంఘటన జరిగిన అరగంటలోనే డీజీపీ ఒక కన్‌క్లూజన్‌ ఇవ్వడం దారుణమన్నారు. వైయస్‌ జగన్‌ అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని, నిందితుడిని ఏమి చేయవద్దని చెప్పారన్నారు. బాధగా ఉన్న సరే..ఎయిర్‌ పోర్టులో అందర్ని పలకరిస్తూనే వచ్చారన్నారు. ప్రాథమిక చికిత్స చేసి హైదరాబాద్‌కు పంపించారని, అక్కడ పోలీసులు ఉండాలని సూచించి ఉంటే విశాఖలోనే ఉండేవారన్నారు. ఒక ఆయుధం ఎయిర్‌ పోర్టులోకి ఎలా వచ్చిందని మా పార్టీ నాయకులు ప్రశ్నించారని, ఆ కత్తికి విషం ఏమైనా ఉందా అని అనుమానం వ్యక్తం చేశారన్నారు. పబ్లిసిటీ కోసం ఈ ఘటనను వాడుకునేతత్వం వైయస్‌ జగన్‌ది కాదన్నారు. చంద్రబాబు అయితే వెంటనే స్ట్రేచర్‌పై పండుకొని, పురవీధుల గుండా ఊరేగేవారని తెలిపారు. అభిమానంతోనో, అమ్ముడపోయో ఓ వర్గం మీడియా అంగీపై రక్తం లేదని చర్చ జరపడం, డీజీపీ స్టేట్‌మెంట్‌  ఇవ్వడంపై మాకు అనుమానం వచ్చిందన్నారు. సెల్‌ఫోన్‌లో మెసెజ్‌లు చూస్తూ ఆయన మాట్లాడటం అనుమానంగానే ఉందన్నారు. లెటర్‌లో ఉన్న అంశాలను కూడా విచారణలోకి తీసుకుంటామన్నారు..కానీ ఆ లెటర్‌లో ఏముందో  అప్పుడు చెప్పలేదన్నారు. విచారణ మొదలుపెట్టామని డీజీపీ చెప్పారన్నారు. వీవీఐపీ అక్కడ ఉంటే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. నిందితుడి రాసినట్లు ఒక్కో పేజీలో ఒక్కరకంగా రాశారన్నారు. మా నాయకుడిపై బుదరజల్లి టీడీపీ ఓ డ్రామా రక్తికట్టించారన్నారు. రాత్రి చంద్రబాబు ప్రెస్‌మీట్‌ చూస్తే ఆశ్చర్యమనిపిస్తుందన్నారు. అన్ని పార్టీలన్నీ కూడా తనపై దాడి చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మీడియా బలం చూసుకొని చంద్రబాబు తనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. 2003 వరకు చంద్రబాబు వైఖరి వేరే విధంగా ఉండేదని, ఆ తరువాత ఎట్లా ఉన్నా మీడియా మనకు అనుకూలంగానే చూపిస్తుందని చంద్రబాబు గ్రహించారన్నారు. శివాజీ అనే నటుడు ఎప్పుడో ఒక పురాణం చేసి వివరిస్తే అప్పట్లో అందరం నవ్వుకున్నామన్నారు. ఈ రోజు చూస్తే శివాజీ ఏమన్నారో దాన్ని మేం అనాలని చెప్పారు. మా అనుమానం ..వీళ్లే రెండు  బస్సులు తగులబెట్టి మాపై నిందలు వేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నారు. చంద్రబాబు లోపల ఎంత రక్షస ఆనందం ఉందో తెలియదు కానీ..ఒక దాడి జరిగినప్పుడు ఏమాత్రం విచక్షణ ఉన్న వ్యక్తి వక్రీకరించి మాట్లాడరన్నారు. చంద్రబాబు వయస్సు రీత్యా అయినా దాడిని ఖండించి..సానుభూతి తెలిపేవారన్నారు. చంద్రబాబు అదికూడా దాచిపెట్టుకోలేకపోయారన్నారు. చంద్రబాబు నవ్వు, మాట్లాడే తీరు బాధాకరమన్నారు. ఎయిర్‌పోర్టు నుంచి వైయస్‌ జగన్‌ నేరుగా ఆసుపత్రికి వెళ్తే..జగన్‌ నవ్వుతూ ఇంటì కి వెళ్లాడని, ఢిల్లీ నుంచి ఫోన్‌ వస్తే ఆసుపత్రికి వెళ్లి పడుకున్నారని చంద్రబాబు అనడం ఆయన రక్షాసానందం బయటపడిందన్నారు. సీనియర్‌ నాయకుడు అట్లా మాట్లాడటం షాక్‌కు గురయ్యామన్నారు. దేశ చరిత్రలో ఏదైనా ఘటన జరిగిన వెంటనే ఫలానిది జరిగిందని డీజీపీ చెప్పడం ఇదే ప్రథమమన్నారు. మీ ప్లాన్‌ ఏదో ఉందన్నారు. టీడీపీ ప్రమేయంతో, వాళ్లే సూత్రదారులుగా  వైయస్‌ జగన్‌పై దాడి జరిగిందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అర్హుడు కాదన్నారు. ఎయిర్‌పోర్టులోని క్యాంటీన్‌ ఓనర్‌ను ఎందకు విచారించరని ప్రశ్నించారు. అసలు విషయం పక్కన పెట్టి మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, నిందితుడిని ఇంతవరకు కోర్టుకు తీసుకెళ్లలేదని, అతనికి ఏమైనా జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. విజ్ఞత కలిగిన రాష్ట్ర ప్రజలు గమనించాలని, చంద్రబాబు ప్రెస్‌ మీట్‌ దృశ్యాలు గమనించాలని విజ్ఞాప్తి చేశారు. కనీసం ఓ మనిషికి ఉండాల్సిన విలువలు చంద్రబాబుకు లేవని వ్యాఖ్యానించారు. వైయస్‌ జగన్‌పై జరిగిన దాడిని అందరు ఖండించాలన్నారు. ఈ ఘటనపై సీబీఐపై విచారణ చేయించాలని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండు చేశారు. మమ్మల్నే నిందితులుగా చిత్రీకరించే విధంగా అధికారపార్టీ కుట్ర చేస్తుందని హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశామని చెప్పారు. జనం ముందు టీడీపీ విధానాలను ఎండగడుతామని, టీడీపీకి, బీజేపీకి ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోవాలని, మా జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. మా నాయకుడిని కాపాడుకుంటామని, రాష్ట్రంలో రాబోయే మార్పుకు ఒక మంచి నందిగా ఈ తరువాత జరిగే పరిణామాల్లో వీటిని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తామని రామకృష్ణారెడ్డి తెలిపారు. ‡ుగబోయే పరిణామ


 

తాజా వీడియోలు

Back to Top