ఏపీ బంద్‌ సెగ్‌ ఢిల్లీకి తాకాలి

ప్రత్యేక హోదా ప్రజల జీవన్మరణ సమస్య
రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల కోసం కదలిరండి
బంద్‌లో పాల్గొని విజయవంతం చేయండి
వైయస్‌ జగన్‌ సీఎం అయితే హోదా వచ్చుండేది
బాబు చేతిలో మరోసారి మోసపోవాలా అనే స్పృహ ప్రజల్లో రావాలి
రాజకీయాల్లో మార్పు కోసం పరితపించే వ్యక్తి వైయస్‌ జగన్‌
అవిశ్వాసం ప్రవేశపెట్టిన మరుసటి రోజే చర్చకెలా వచ్చింది
టీడీపీ, బీజేపీ లాలూచీ రాజకీయాలు ఇంకా కొనసాగుతున్నాయి
హైదరాబాద్‌: ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన బంద్‌తో జనజీవనం స్తంభించి ఎఫెక్ట్‌ కేంద్ర ప్రభుత్వంపై పడాలని వైయస్‌ జగన్‌ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.  రేపు జరగబోయే బంద్‌ జీవన్మరణ సమస్యకు సంబంధించింది. రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా అనేది గుర్తు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని సజ్జల కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంకోసారి తప్పుడు మాటలు చెప్పే పార్టీల చేతుల్లో మోసపోవాలా అనే స్పృహ అందరిలో రావాలి.. ఆ దృష్టితో అన్నివర్గాల ప్రజల బంద్‌లో పాల్గొనడంతో పాటు.. చుట్టూ ఉన్నవారిని కూడా పాల్గొనేట్లుగా చేయాలని పిలుపునిచ్చారు. కొంచెం ఇబ్బంది అయినా రాష్ట్ర భవిష్యత్తు కోసం. పిల్లల భవిష్యత్తు కోసం తప్పదన్నారు. 

చంద్రబాబులా ప్రచార ఆర్భాటాలు.. మీడియా మేనేజ్‌మెంట్‌లు, పైపై మాటలు చెప్పడం.. ఒక్క రాత్రి యూటర్న్‌ తీసుకొని మాదే కరెక్ట్‌ అనే వ్యక్తిత్వం వైయస్‌ఆర్‌ సీపీకి లేదన్నారు. ప్రజలే నాలుగేళ్లుగా ఏయే హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని ఏ విధంగా మోసం చేసిన వ్యక్తి ఒకవైపు.. తండ్రి ఆశయాల కోసం దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి రాజకీయ వారసత్వాన్ని పునికిపుచ్చుకొని ఎక్కడా రాజీపడకుండా.. ఎవరికీ తలవంచకుండా.. ప్రజల కోసం తపించే వైయస్‌ జగన్‌ జగన్‌ కావాలా అనేది ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. ఎవరు నిజాయితీ పరులు.. ఎవరు చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్నారనేది ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. వైయస్‌ జగన్‌ ఇచ్చిన బంద్‌ పిలుపు చంద్రబాబులా అధర్మ ఆరాటం కాదని.. రాష్ట్ర భవిష్యత్తు కోసం ధర్మపోరాటమన్నారు. నేను చెప్పిందే వేదం.. ప్రజల చెవుల్లో ఎన్ని పూలయినా పెట్టొచ్చు అనే ధీమాతో చంద్రబాబు ఉన్నాడని, అలాంటి రాజకీయాలకు నూకలు చెల్లాయని రోజులు రావాలి.. రాజకీయాల్లో మార్పు కోసం వైయస్‌ జగన్‌ పరితపిస్తున్నారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన బీజేపీ, టీడీపీలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. 

2014 ఎన్నికల్లో బీజేపీ, జననేన పార్టీలను రెండు చక్రాలుగా ఉపయోగించుకొని చంద్రబాబు గెలిచారన్నారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేదని, శక్తియుక్తులన్నీ దారపోసి సాధించేవారన్నారు. కేంద్రం మొండి వైఖరి అవలంబిస్తే పోరాటానికైనా దిగేవారని, అది వైయస్‌ జగన్‌ చిత్తశుద్ధి పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కూడా ఇప్పటికీ పూర్తయ్యేదని తెలిపారు. వైయస్‌ఆర్‌ ఉన్నప్పుడు పాలన.. ఆయన మరణించిన తరువాత పాలన ఏ విధంగా ఉందో.. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చి ఉంటే ఎలా ఉండేదో.. రానుందన ఏ జరుగుతుందో ప్రజలు తెలుసుకోవాలన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితే వైయస్‌ఆర్‌ పథకాలు రెండింతలు వేగంగా ప్రజలకు మరింత చేరువలో ఉండేవన్నారు. 

తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం కేంద్రం తప్పని తాము తప్పించుకునే ధోరణిలో మాట్లాడుతున్నారని సజ్జల ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు బీజేపీ నుంచి బయటకు వచ్చి మాకేం సంబంధం లేదన్నట్లుగా పోరాడే చాంపియన్లుగా ఫోజులు ఇస్తున్నారని మండిపడ్డారు. రెండు ప్రధాన జాతీయ పార్టీలు కూడా మాకు ఆంధ్రప్రదేశ్‌పై దయ, ప్రేమ లేదని స్పష్టంగా తేల్చారన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాని మోడీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చిచెప్పారన్నారు. ఈ నేపథ్యంలో గత నాలుగేళ్లుగా రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి రాష్ట్ర సమస్యలపై పోరాడుతూ.. 2014లో అధికారం అంచుల వరకు వచ్చి చేజారిపోయినా.. ప్రధాన ప్రతిపక్షంగా ఏనాడూ వైయస్‌ఆర్‌ సీపీ బాధ్యతలను విస్మరించలేదన్నారు. ప్రత్యేక హోదా రాకపోతే భవిష్యత్తు లేదని నినాదంతో ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేయముందే వైయస్‌ జగన్‌ ఆయన్ను కలిసి ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలని కోరారని గుర్తు చేశారు. అప్పటికీ ఇంకా చంద్రబాబు కదల్లేదన్నారు. 

ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలపకోతే ప్రమాణస్వీకారం చేయనని పట్టుబట్టి సాధించానని పదే పదే చెప్పుకునే చంద్రబాబు మరి రాష్ట్రాన్ని ప్రాణాధారమైన ప్రత్యేక హోదాను ఎందుకు సాధించలేకపోయారని సజ్జల ప్రశ్నించారు. కేంద్ర కేబినెట్‌ మీటింగ్‌లలో టీడీపీ ఎంపీ అశోక్‌గజపతిరాజు పక్కన కూర్చునప్పుడు ఎందుకు హోదా అంశంపై కేంద్రంపై ఒత్తిడి తేలేదని నిలదీశారు. ప్యాకేజీ అనే పదాన్ని తెరమీదకు తీసుకువచ్చి చంద్రబాబు దాన్ని అంగీకరించి.. వంద రెట్లు మెరుగైందని ప్రకటించుకొని వెంటనే అరుణజైట్లీకి అర్ధరాత్రి కృతజ్ఞతలు చెప్పారని గుర్తు చేశారు. ప్యాకేజీ బ్రహ్మాండంగా ఉందని తీర్మానాలు సైతం చేశారన్నారు. 

నాలుగేళ్లుగా వైయస్‌ జగన్‌ ప్రత్యేక హోదాకు ప్లానింగ్‌ కమిషన్‌కు ఎలాంటి సంబంధం లేదని చెబుతూనే ఉన్నారన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్యులు రాసిన లేఖలను కూడా అసెంబ్లీలో, బయట చూపించారన్నారు. గత మార్చిలో జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో తుది సమరంగా వైయస్‌ జగన్‌ ఎంపీలతో రాజీనామాలు చేయిద్దాం.. రండి దేశాన్ని కదిలిద్దాం అని హితవు చెప్పారని, మీరే అవిశ్వాసం పెట్టండి మద్దతు ఇస్తామన్నా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. వైయస్‌ జగన్‌ రాసిన లేఖతో జాతీయ పార్టీలన్నింటినీ కలుసుకొని ఎంపీలు మద్దతు కూడగడుతున్న సమయంలో వైయస్‌ఆర్‌ సీపీకి ఎక్కడ క్రెడిట్‌ వస్తుందోననే కుట్రతో టీడీపీ అవిశ్వాసం డ్రామా ఆడిందన్నారు. ఏప్రిల్‌ 6వ తేదీన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు కూర్చొని దేశమంతా చర్చ జరిగేలా చేశారన్నారు. 

టీడీపీ అవిశ్వాసం వెంటనే చర్చకు రావడం పట్ల పలు అనుమానాలు తలెత్తుతున్నాయని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం అయ్యాక తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెట్టడం.. బీజేపీతో యుద్ధం అని ప్రగల్భాలు పలకడం.. మరుసటి రోజే అవిశ్వాసం చర్చకు రావడం చూస్తుంటే బీజేపీ, టీడీపీ సంబంధాలు కొనసాగుతున్నాయని స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. చంద్రబాబు చేసేది పోరాటంలా కనిపించడం లేదని, పోరాటం అంటే అన్ని సంఘాలు, పార్టీలు కలుపుకొని పోవాలన్నారు. అలా చేసింది వైయస్‌ జగన్‌ ఒక్కరేనని, వైయస్‌ జగన్‌ పోరాటంతో ప్రజల్లో ప్రత్యేక హోదా సెంటిమెంట్‌ పెరిగిందన్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో చంద్రబాబు పోరాటం కంటే డ్రామా.. కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయన్నారు. 
Back to Top