మహానేత ఆశయాలే వైయస్‌ఆర్‌ సీపీ సిద్ధాంతాలు

వైయస్‌ జగన్‌ మహాయజ్ఞం చివరిదశకు చేరింది
దుష్టపాలనను అంతమొందించే రోజులు దగ్గరలోనే ఉన్నాయ్‌
హైదరాబాద్‌: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలే సిద్ధాంతాలుగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించి ప్రజాసేవలో నిమగ్నమైన నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వైయస్‌ జగన్‌ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో జరిగిన వైయస్‌ఆర్‌ జయంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ కలలకు మరింత జీవం పోస్తూ వైయస్‌ జగన్‌ చేస్తున్న మహాయజ్ఞం చివరి దశకు చేరుకుందన్నారు. 2009లో ఆగిపోయిన మంచిరోజులు 2019లో వైయస్‌ జగన్‌ రూపంలో మళ్లీ వస్తాయని దీమా వ్యక్తం చేశారు. మంచి పరిపాలన ఎలా ఉంటుందో వైయస్‌ఆర్‌ చేసి చూపించారని, దౌర్జన్యం, దుర్మార్గం ఎలా ఉంటుందో చంద్రబాబు చూపించారని, దుష్టపాలనను అంతమొందించేందుకు రాజన్న పాలన తీసుకొచ్చేందుకు సాగుతున్న మహా ప్రయాణం విజయం సాధిస్తుందన్నారు. ఆ దిశగా ప్రతీ కార్యకర్త నాయకులు నడుం బిగించాలని కోరారు. 
Back to Top