బాబు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండిప్రకాశం: చంద్రబాబు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లాలో నిర్వహించిన బూత్‌ కమిటీ కన్వీనర్ల శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు మరోసారి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వైయస్‌ జగన్‌ చెబుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చెప్పాలని వివరించారు. వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ 165 సీట్లకు తగ్గకుండా గెలుపొందేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు వివేష ఆదరణ వస్తుందని, వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు భావిస్తున్నారన్నారు. రాజన్న రాజ్యం వైయస్‌ జగన్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు.
 
Back to Top