బూత్‌ కమిటీలే పార్టీకి వెన్నుముక


 ఒంగోలులో వైయస్‌ఆర్‌సీపీ బూత్‌ కమిటీ కన్వీనర్ల సమావేశం
ప్రకాశం: పార్టీకి బూత్‌ కమిటీలే వెన్నుముక అని వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఒంగోలులో వైయస్‌ఆర్‌సీపీ బూత్‌ కమిటీ కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రత్యర్థి పార్టీని మట్టి కరిపించేలా బూత్‌ కమిటీ కన్వీనర్లు పని చేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రత్యర్థి పార్టీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. 2019లో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. వైయస్‌జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే రాజన్న రాజ్యం వస్తుందని భరోసా కల్పించారు.
 
Back to Top