నాలుగేళ్లయినా ఒక్క హామీ నెరవేర్చలేదు

ఢిల్లీ: వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా నరేంద్రమోడీ, చంద్రబాబులు అనేక హామీలిచ్చారని, నాలుగేళ్లయినా వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని వైయస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. ప్రజల సంక్షేమమే ధ్యేయం.. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధే లక్ష్యం.. హోదా సాధించడం కర్తవ్యమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ పోరాటం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలంతా రాజీనామాలు చేసి ప్రాణాలు పణంగా పెట్టి ఆమరణ దీక్ష చేపట్టారన్నారు. 
Back to Top