పెడన నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌సీపీ జెండా ఎగురవేస్తాం


కృష్ణా జిల్లా : పెడన నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌సీపీ జెండాను ఎగురవేస్తామని నియోజకవర్గ సమన్వయకర్త రాంప్రసాద్‌ అన్నారు. చంద్రబాబు నాపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని, బతికున్నంత కాలం వైయస్‌ జగన్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పెడనలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో మినుము యార్డు ఏర్పాటు చేయాలని, రామరాజు కాల్వ, బొడ్డుకాల్వ ఏర్పాటు చేయాలన్నారు. ఎత్తిపోతల ద్వారా నియోజకవర్గాన్ని ఆదుకోవాలని వైయస్‌ జగన్‌ను కోరారు. చేనేత కార్మికులు, ముదిరాజు, క్షత్రియులను ఆదుకోవాలన్నారు. నియోజకవర్గంలో మంచి ఏర్పాటు చేయాలని కోరారు. పెడన పట్టణంలో 50 పడకల ఆసుపత్రి కట్టించాలని విజ్ఞప్తి చేశారు. yì గ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలన్నారు. వైయస్‌ జగన్‌ నియోజకవర్గంలో అడుగుపెట్టగానే వర్షం కురిసిందని, దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశీస్సులు నియోజకవర్గంపై ఉన్నాయని చెప్పారు. వైయస్‌ జగన్‌ సీఎం కాగానే ఎత్తిపోతల ఏర్పాటు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
Back to Top