కర్నూలులో క్లీన్‌స్వీప్ ఖాయం

 కర్నూలు:  వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ర్నూలు జిల్లా  వైయ‌స్ఆర్ సీపీ అన్ని స్థానాల్లో గెలిచి క్లీన్‌స్వీప్ చేయ‌డం ఖాయ‌మ‌ని పార్టీ క‌ర్నూలు పార్ల‌మెంట్ జిల్లా అధ్య‌క్షుడు బీవై రామ‌య్య విశ్వాసం వ్య‌క్తం చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు జిల్లాలో విశేష స్పంద‌న ల‌భించింద‌న్నారు. వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితేనే జి ల్లా అభివృద్ధి చెందుతుంద‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నార‌న్నారు. ఇటీవ‌ల మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి పార్టీలో చేర‌డంతో జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ మ‌రింత‌ బలోపేతం అయిందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలో​ ఉన్న 14 నియోజకవర్గాలను వైయ‌స్ఆర్‌సీపీ గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న వ్యక్తి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని, అలాంటి వ్యక్తికి తన వంతు సహకారం అందించాలనే కాటసాని పార్టీలో చేరారని తెలిపారు. 

జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం: కాటసాని
రానున్న ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ గెలుపు కోసం కృషి చేస్తానని  పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌ రెడ్డి అన్నారు. వైయ‌స్‌ జగన్‌ను ముఖ్యమంత్రి చేయడమే తన లక్ష్యమనీ, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు. అధినేత ఆదేశాల మేర‌కు ప‌నిచేస్తాన‌ని చెప్పారు.   

Back to Top