రైతుల ఆత్మహత్యల పాపం టీడీపీదే..

కర్నూలుః రుణమాఫీ పేరుతో  రైతులను టీడీపీ ప్రభుత్వం నట్టేంట ముంచిందని వైయస్‌ఆర్‌సీపీ నేత బి.వై రామయ్య మండిప‌డ్డారు. మీ ఇంటి పెద్దకొడుకుగా వస్తానని, మీ రుణభారం నాదేనంటూ అబద్ధపు హమీలు, బూటకపు కబుర్లతో గద్దెనెక్కిన చంద్రబాబు రైతు హత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రైతులకు రణమాఫీ జరగకపోగా వడ్డీలకు వడ్డీలు పెరిగి కొత్త రుణాలు రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. వర్షాలు లేకపోవడం పంటలు ఎండిపోవడంతో  రైతులు కరువుతో అల్లాడిపోతున్నారని, జిల్లామొత్తాన్ని కరువు జిల్లాగా ప్రకటించకపోగా, రైతులను కనీస సాయం కూడా అందించడం లేదని విమర్శించారు.  
Back to Top