నిజాయితీపరుడికే ప్రజలు పట్టం కడతారు


– ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
తిరుపతి: అసత్యవాదులు ఎన్ని చెప్పినా నిజం నిలకడ మీద తెలుస్తుందని, నిజాయితీపరుడైన వైయస్‌ జగన్‌కే ప్రజలు పట్టం కడతారని ౖÐð యస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. మొన్న జగ్గంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో తాను కూడా వైయస్‌ జగన్‌ ప్రక్కనే వేదిక మీద ఉన్నానని చెప్పారు. కాపు రిజర్వేషన్లపై వైయస్‌ జగన్‌ వ్యాఖ్యలను తప్పు దోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. వాస్తవ సత్యాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారని తెలిపారు. చంద్రబాబు లాగా జరగని విషయాలను తాను చేస్తానని చెప్పి అడ్డదారిలో అధికారంలోకి వచ్చే రకం వైయస్‌ జగన్‌ కాదన్నారు.  చేయగలిగింది మాత్రమే చెప్పగలను అని ప్రకటించారన్నారు. కాపు జాతి అభివృద్ధి కోసం వైయస్‌ జగన్‌ సర్వం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాపు జాతికి దూరం చేయాలనే ఆలోచన మానుకోవాలని హితవు పలికారు. 
 
Back to Top