జేసీ దివాకర్‌రెడ్డి రేవు దాటాక తెప్ప తగలేసే రకం


అనంతపురం:  టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై వైయస్‌ఆర్‌సీపీ నేతలు భగ్గుమన్నారు. వైయస్‌ఆర్‌ కుటుంబంపై జేసీ చేసిన ఆరోపణలను తిప్పి కొట్టారు. జేసీ దివాకర్‌రెడ్డి రేవు దాటాక తెప్ప తగలేసే రకమని మండిపడ్డారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాడిపత్రి వైయస్‌ఆర్‌సీపీ నేత పైలా నర్సింహులు మాట్లాడుతూ.. జేసీ వాడుకోని వదిలేసే రకమన్నారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నేదురుమళ్లి జనార్ధన్‌రెడ్డి, వైయస్‌ రాజశేఖరరెడ్డిలను వాడుకొని వదిలేసిన జేసీ..ఇప్పుడు చంద్రబాబుకు బాగా అలవాటు అయ్యిందన్నారు.
 
Back to Top