వైయస్‌ఆర్‌ సీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్సీ దాడి

కలుషిత నీరు సరఫరా అవుతుందని ప్రశ్నించిందుకు వీరంగం
విజయనగరం: మంచినీటి కుళాయిల్లో మురికినీరు సరఫరా అవుతోందని ప్రశ్నించిన వైయస్‌ఆర్‌ సీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్సీ జగదీష్‌ దాడికి పాల్పడ్డారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం వచ్చిన ఎమ్మెల్సీ జగదీష్‌ వీరంగం సృష్టించారు. శుద్ధనీటికి బదులుగా కుళాయిల్లో కలుషిత నీరు ప్రవహిస్తుందని, ఇలా అయితే.. ఎలా అని వైయస్‌ఆర్‌ సీపీ నేతలు ఎమ్మెల్సీని ప్రశ్నించారు. దీంతో ఊగిపోయిన జగదీష్‌ వైయస్‌ఆర్‌ సీపీ నేతలను దుర్భాషలాడుతూ.. దాడికి దిగారు. దీంతో టీడీపీ, వైయస్‌ఆర్‌ సీపీ, టీడీపీ నేతల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. 
 
Back to Top