నల్లబ్యాడ్జీలతో వైయస్‌ఆర్‌సీపీ నేతల నిరసన


పశ్చిమ గోదావరి: టీడీపీ నేతల తీరుపై వైయస్‌ఆర్‌సీపీ నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ద్వారకా తిరుమల మండలం రాళ్లకుంటలో అక్రమ మట్టి తవ్వకాలపై తహశీల్దార్‌కు వైయస్‌ఆర్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు తలారి వెంకట్రావు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తలారి వెంకట్రావ్‌పై టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారు. టీడీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు డిమాండు చేశారు.
 
Back to Top